కోదాడ టికెట్ మీద చర్చ

హైద‌రాబాద్‌: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 23న న్యూయార్క్ నగరంలో జలగం సుధీర్ కలవనున్నారు. 2001 నుండి గులాబీ పార్టీలో పనిచేస్తూ, 2016 నుండి కోదాడలోనే మకాం వేసి సామాజిక సేవ చేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న సుధీర్ కు అటు పార్టి పరంగా, ఇటు సర్వేల పరంగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. స్థానికంగా మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వని పక్షంలో జలగం సుధీర్ కు గానీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ సతీమణి సుష్మాకు గాని టికెట్ ఇచ్చే విషయంలో అటు కేటీఆర్ ఇటు కవిత తమ అభిప్రాయాలను ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం అమెరికా వెళ్లిన సుధీర్ ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ను కలిసి కోదాడ అసెంబ్లి టికెట్ కోసం చర్చించారు. ప్రవాస భారతీయుల మద్దతు కోసం అమెరికా వెళ్లిన సుధీర్ అగస్ట్ 23 వ తేదిన మరోసారి కేటీఆర్‌ను కలవనున్నారు.

సెప్టెంబర్ 4 వ తారీఖున కోదాడ రానున్న సుధీర్ ఎలక్షన్ లకు అవసరమైన అన్ని వనరులను సిద్దం చేసుకుంటున్నాడు. వివిధ దర్యాప్తు,సర్వే సంస్థల ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్ కూడా సుధీర్ దంపతుల విషయంలో సానుకులంగా ఉన్నట్టు సమాచారం.

 

By admin