పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు
జగిత్యాల (మీడియాబాస్ నెట్‌వర్క్):
తెలంగాణ ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుకగా బదిలీలకు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేయనుంది. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెల్లడించారు.
ఈ ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్య ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు సంవత్సరాల సుదీర్ఘకాలం నుంచి ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తూ నిత్యం ప్రభుత్వాన్ని ఉద్యమాలతో దిగ్బంధనం చేస్తూ ఉపాధ్యాయ సమస్యలే ప్రధాన అజెండాగా పనిచేస్తున్న తరుణంలో ప్రభుత్వం దిగివచ్చి ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు ప్రకటించడం హర్షనీయమని, అందుకుగాను సీఎం కేసీఆర్‌కి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి, ప్రత్యేక చొరవతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందంజ వేసిన మంత్రి తన్నీరుహరీష్ రావుకి ప్రభుత్వపెద్దలకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన సమస్యలైన 317 జీవో అపరిష్కృత అప్పీళ్లు, స్థానికత జిల్లా ప్రతిపాదికన కేటాయింపులు చేయడం, 13 జిల్లాల స్పౌజ్ కేటాయింపులు, మూడు డిఏల పెండింగ్ బకాయిల సమస్యలు ఇంకా సందిగ్ధంలో ఉన్నాయని వీటిని కూడా వెంటనే పరిష్కరించి ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఎంప్లాయిస్ అనే ముద్రను నిజం చేయాలని ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews