వాషింగ్ట‌న్ డీసీ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్రముఖ కవి, రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ నెల రోజుల పాటు వివిధ సాహిత్య సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటిస్తున్నారు. ముందుగా డెట్రాయిట్ లో జరుగుతున్న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పాతికేళ్ల పండుగ సమావేశాల్లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్ డి.సి, వర్జీనియా, మేరీ ల్యాండ్ ప్రాంతాల్లో అక్టోబర్ 7, 8 తేదీల్లో , డల్లాస్ లో అక్టోబర్ 14, 15 , 16 తేదీల్లో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు . ఆ తర్వాత క్యాలిఫోర్నియావంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మిల్పిటాస్ లో జరగనున్న సంయుక్తంగా నిర్వహిస్తున్న 13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. ఎస్.వి .యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి హోదాలో పోర్టులాండ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తారు. సియాటెల్ తెలుగు సంఘం ఏర్పాటు చేస్తున్న మ‌రో సాహిత్య సమావేశంలో వాషింగ్టన్ నగరంలో ఇంకొక సాహిత్య సమావేశంలో ప్రసంగించనున్నారు.

ఈ పూర్తి పర్యటనను వర్జీనియాకు చెందిన ప్రముఖ కథా రచయిత, మూవీ మేకర్ వేణు నక్షత్రం, కాలిఫోర్నియాలో నివసిస్తున్న సాహిత్యకారులు వెంకట్ నాగం నిర్వహిస్తున్నారు. ఆచార్య ఇనాక్ ని కలిసి సాహిత్య సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుంటే వేణు నక్షత్రంని, వెంకట్ నాగంని సంప్రదించాలని తెలిపారు. వివిధ నగరాల్లో ఆచార్య కొలకలూరి ఇనాక్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సాహిత్యాభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు. వంగూరి ఫౌండేషన్, సిలికానాంద్ర‌ యాజమాన్యాలకు, డెట్రాయిట్ సాహితీ క్లబ్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin