హైద‌రాబాద్: తెలంగాణ‌ రాష్ట్రసమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరింపజేసి దేశంలో కీలకనాయకుడిగా మారుతున్న KCR పై BRS పార్టీపై లేనిపోని అపవాదులు వేయాలనుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణలో KCR చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మిషన్ కాకతీయ మొదలుకొని రైతులకు ఇచ్చే ఉచిత 24 గంటల కరెంట్, ఫించన్.. ఇలా అనేక పథకాలు ఉన్నాయని.. వీటి ముందు CONGRESS పాదయాత్ర చేసినా, బైక్ యాత్ర చేసినా  ప్రజలు నమ్మేస్థితిలో లేరని గువ్వల చెప్పారు.

రెండు దఫాలుగా తెలంగాణను పరిపాలిస్తున్న KCR దేశ భవిష్యత్తుకోసం నడు0 బిగించారని.. మేమంతా సైనికుల్లా ఆయన వెన్నంటే ఉంటామని అందులో భాగంగానే జై KCR జై BRS నినాదంతో దేశమంత తిరిగి సత్తా ఏంటో చూపిస్తాం అని అన్నారు. ఇక దేశంలో బీజేపి ప్రభుత్వం చేసిన మేలు ఏంలేదని ఉన్న కట్టడాలను కూలగొడుతున్నారని దానిలో భాగంగా తెలంగాణలో ప్రగతి భవన్, నిర్మాణంలో ఉన్న తెలంగాణసచివాలయాన్ని కూడా కూలదోస్తం అనడం వారి నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని.. నిజంగానే BJPది అరాచక పాలన అని తెలిపారు. BJPదుర్మార్గలను ప్రచారం చేస్తున్న BBC ఛానెల్ పై పనిగట్టుకొని విషప్రచరాలు చేస్తూ BBCని దేశంలో ప్రచారం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ అంతర్జాతీయంగా పేరు ఉన్న ఛానెల్ కేవలం BJPని కావాలని తప్పుపడుతుందని అనడం కేవలం BJP తెలివితక్కువ పని అంటూ.. నిజానిజాలు దేశ ప్రజలకు కూడా తెలుసని అన్నారు. ఇలా చేయడం భావప్రకటన స్వేచ్చను, మీడియా స్వేచ్చను హరించడమే, అయినా BJP ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లుపొడిచేలా నడుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందని వ్యాఖ్యానించారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin