శీనన్న నీవు ఏం చేస్తున్నావని నేనడగను. ఎందుకంటే నిరంతరం నువ్వు సామాజిక చింతనతో ఉంటావు కాబట్టి. ఎవరికైనా నీ గుండె సంచిని చదివినప్పుడే అర్థమైతది.

నేడు సంఘమనేది అచేతనంగా ఉండి స్ట్రెచ్చర్ పై మాస్క్ పెట్టుకుని కొన ఊపిరితో ఉన్నవాటికి ఆక్సిజన్ నీవై బతికే ఉన్నాయని నిరూపించడానికి సంఘాలు మాట్లాడాల్సిన డిమాండ్లు మీ మీద వేసుకొని పరిష్కార వేదికగా గౌడ కులస్తులకు అండగా నిలబడటం అంటే చైతన్యవంతమైన భావన ఉన్నవారికే సాధ్యం.

అనేక విషయాలను ప్రభుత్వంతో ఒప్పించి చేయడం, అది వెనువెంటనే జీవో గా మారడం, పరిష్కార రూపం సంతరించుకోవడం ఒక కోణంలో చూస్తే దమ్ము ఉండాలి. నేను మంత్రి గురించి ఇలా రాస్తే చాలామంది భజన అనుకోవచ్చు – కానీ నేను నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తా.! తను పనిచేసి సంఘాలను పిలిచి వేదికపై కూర్చోబెట్టి పేరుపేరునా పిలవడం మా సంఘాలు బతికే ఉన్నాయని సమాజానికి చూపే ప్రయత్నం చేయడం నిజంగా నీలోని కలుపుకుపోయే గుణానికి ఈతముల్లు సలాం చేస్తుంది.

పాపన్న (సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్) గురించి ఎలుగెత్తి చాటటానికి, అది చట్ట ప్రకారం అమలుపరచడానికి, మీ కృషి, మీ పట్టుదల అభినందనీయం. పోస్టల్ స్టాంప్కు ప్రయత్నం, అలాగే జయంతి వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడంకు చట్టం చేయడంలో, ట్యాంక్బండ్ పై విగ్రహం పెట్టాలని స్థలం కేటాయింపులో నీ పాత్ర అద్వితీయం.

కానీ విగ్రహం ఏర్పాటులో ఆత్రుత పడక పోతే త్వరలో ఎన్నికలు ఉన్నందున రేపటి రోజు నీలాగా ఏ లీడర్ ఇంత చొరవతో చేయలేరు. కాబట్టి త్వరలో పాపన్న విగ్రహం ఏర్పాట్లలో తొందర పడాల్సి ఉందని నా బాధ్యతగా ఈతముల్లు గుర్తు చేస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ఈరోజు విగ్రహం ఏర్పాటులో లోపం జరిగితే బాధ్యత మీదేసుకొని ఎవరు వచ్చినా చేయలేరని నేను భావిస్తున్నాను.

మరో అంశం:-

నీరా పాలసీ జీవో గా మారడమే కాదు, ఇంప్లిమెంటేషన్ లో నీరా వ్యవస్థను కొనసాగించడానికి నీరాబోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డ్ చైర్మన్ గా ప్రభుత్వ అధికారిని నియమిస్తూ గౌడ కులస్తుల నుండి వైస్ చైర్మన్ మరియు బోర్డ్ డైరెక్టర్లు వ్యవస్థకు అంకురార్పణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిని కూడా ఎన్నికలలోపు ఏర్పాటు చేస్తేనే జీవో అమలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.

ఈ నీరా బోర్డు కు అనుబంధంగా 2000 ఎకరాలతో ప్రభుత్వ భూమిలో తాడి టాపర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కావలసిన భూసేకరణ వెంటనే జరిగాలని విన్నపం. హైదరాబాదుకు 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో చాలా ప్రభుత్వ భూమి ఉంది. మీరు చొరవ తీసుకొని ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిని ఒప్పించి జీవో చేయించడంలో ఘటికుడివి కాబట్టి నిన్ను అభ్యర్థిస్తున్నా. తెలంగాణలో తాటి ఈత సబ్ సెంటర్ మాత్రమే ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యానవన శాఖ కొండమల్లేపల్లిలోని 150 ఎకరాల స్థలంలో ఓ మూలకు చిన్న బిల్డింగులో ఉన్నదో లేదో తెలియని విధంగా, సైంటిస్ట్ పని ఏం పరిశోధన చేస్తుండో తెలియని విధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే 2000 ఎకరాల స్థలంలో అత్యున్నత ప్రమాణాలతో రీసెర్చ్ సెంటర్ మరియు నీరా ఉత్పత్తుల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈతముల్లుగా నా విన్నపం.

– మీ… ఈతముల్లు.!

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link

https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

By admin