నటీనటులుః ఉన్ని ముకుందన్, మియా జార్జ్ , గోకుల్ సురేష్
సంగీతంః గోపిసుందర్
దర్శకత్వంః సాయిజు
నిర్మాతః వరం జయంత్ కుమార్
బేనర్ః శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్
విడుదల తేదీః 3-6-2022
రేటింగ్ః 3/5
జనతా గ్యారేజ్, భాగమతి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ఉన్ని ముకుందన్ తను ప్రధాన పాత్రలో మియా జార్జ్ జంటగా నటించిన చిత్రం `మయూరాక్షి`.⇔ పాటలు, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అమాయకుడైన డాక్టర్ అజయ్ అవినీతి పరుడైన కేంద్రమంత్రి చౌడప్ప మనవరాలు ఝాన్సీని ప్రేమిస్తాడు. ఈ తరుణంలో ఓ రోజు అజయ్ పని చేసే హాస్పిటల్ లో కేంద్రమంత్రి చౌడప్ప చెకప్ కి వెళతాడు. ఇంతలో హఠాత్తుగా చౌడప్పకి హార్డ్ ఎటాక్ వచ్చి చనిపోతాడు. అజయ్ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే చనిపోయాడంటూ అతనిపై కేసు అవుతుంది. అజయ్ ఆ కేసు ని ఎలా తప్పించుకున్నాడు? అసలు చౌడప్ప ఎలా చనిపోయాడు? ఈ కేసుని ఛేదించిందెవరు? ఈ కథకు , మయూరాక్షికి లింకేంటి అన్నది మిగతా సినిమా.
ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ః
ఇప్పటికే టాలీవుడ్ లో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగు ప్రేకషకులకు బాగా పరిచయం అయిన మలయాళ యువ హీరో ఉన్ని ముకుంద న్ ఇందులో లవర్ బాయ్ గా, ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన మియా కూడా అడవి బిడ్డగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. డాక్టర్ అజయ్, అతనికి జంటగా నటించిన ఝాన్సీ కూడా బాగా నటించారు. ఝాన్సీ అమ్మగా, సుప్రీమ్ కోర్టు లాయర్ గా నటించిన నటీమణి కూడా కోర్టు సీనుతో మెప్పించింది. కేంద్ర మంత్రిగా, అతని కుమారుని గా నటించిన ఇద్దరు నటులూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతివర్గం :
క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఆ కోవలో రిలీజైన చిత్రమే మయూరాక్షి. కథ, కథనాలతో పాటు గోపిసుందర్ మ్యూజిక్ మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా డాక్టర్ అజయ్, ఝాన్సి ల మధ్య లవ్ ట్రాక్ ను సోసో గా నడిపించి ఇంటర్వల్ బ్యాంగ్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వల్ తరవాత అసలైన కథను అనేక మలుపులతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాడు దర్శకుడు. ఉన్ని ముకుందన్ , మియా జార్జ్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అలానే మినిస్టర్ మర్డర్ మిస్టరీలో వుండే మలుపులు, కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి. నిర్మాత వరం జయంత్ కుమార్ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా రూపొందించారు
విశ్లేషణ :
క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. అలాంటి ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో సినిమా ఆద్యంతం థియేటర్ లో అలరిస్తోంది. ఫస్టాఫ్ లో వచ్చే లవ్ స్టోరి, సెకండాఫ్ లో సాగే ఇన్వెస్టిగేషన్ , క్లైమాక్స్ లో ట్విస్ట్ లు సినిమాను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి. గోపీ సుందర్ సంగీతం, సినిమాటోగ్రఫీ రెండు సినిమాకు బలంగా నిలిచాయి. ల్యాగ్ లేకుండా ఉంటే సినిమాను మరో స్థాయిలో ఉండేది. సినిమాకు మయూరాక్షి టైటిల్ మైనస్ అనే చెప్పాలి. కాన్సెప్ట్ కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుంటే ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించేవారు థియేటర్స్ కి రావడానికి. క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలు ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చే చిత్రమిది.