వీఆర్ఏల ఆవేద‌న‌
రెండు నెల‌ల‌కు చేరిన స‌మ్మె

BREAKINGNEWS TV

మెట్‌ప‌ల్లి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
సీఎం కేసీఆర్.. మా చావులు క‌నిపించ‌డం లేదా? మా క‌న్నీళ్లు క‌నిపించ‌డం లేదా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెట్‌ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్‌కు చెందిన వీఆర్ఏలు. రెండు నెల‌ల నుంచి స‌మ్మె చేస్తున్నా త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌డం లేద‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మెట్‌ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్‌లోని మూడు మండ‌లాల‌ వీఆర్ఏలు నిరవధిక సమ్మెలో తెలియజేశారు. ఇందులో భాగంగా మండల వీఆర్ఏలు తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమింపబోమని స్పష్టం చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స‌మ్మెలో చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ వినోద్, వీఆర్ఏలు రఫీ, గంగాధర్, శ్రీనివాస్, రాజేందర్, అంజయ్య, వినోద్, మహేందర్, నరేష్, సంధ్య, భాగ్య, పద్మ, లావణ్య, భూమేష్, సౌధార్య, అప్సర్ పాస, స‌తీష్, గంజేందర్, రాంరాజ్, లక్ష్మణ్, రాజా కిషన్, నితీష్ మూడు మండ‌లాల‌కు చెందిన వీఆర్ఏలు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
BREAKINGNEWS APP – Download Now

By admin