న్యూజెర్సీ, (స్వాతి దేవినేని):
తెలుగు ఎన్నారై మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మూవర్స్ డాట్ కామ్ అధినేత, తానా ట్రస్టీ కార్యదర్శి విద్యాధర్ గారపాటి. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులకు హ్యాపీ హాలిడేస్ పార్టీ ఇచ్చారు. 2022 సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్న హ్యాపీ హాలిడేస్ లో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఉన్న సముద్ర రెస్టారెంట్ లో మీడియా ప్రతినిధులను కలుసుకుని వారిని అభినందించారు. ఎన్ని కలర్ ఫుల్ కార్యక్రమాలు జరిగినా కెమెరా వెనకే ఉంటూ ప్రపంచానికి చూపించేది జర్నలిస్టులేనని కొనియాడారు. వృత్తిపరంగా మీడియా ప్రతినిధులు చేస్తున్న సేవలను ఈ సందర్బంగా విద్యాధర్ గారపాటి గుర్తు చేసుకున్నారు.
మానవత్వానికి ప్రతిరూపం
విద్యాధర్ గారపాటి మానవత్వానికి ప్రతిరూపమని ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఆయన ఇప్పటికే వందకి పైగా ఉచిత కాన్సర్ క్యాంప్స్ కి రూపకల్పన చేశారు. లక్షలు విలువ చేసే వైద్య పరికరాలను హాస్పిటల్ లకు అందించి తన ఉదారత చాటుకున్నారు. తానా సంస్థ కోసం ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ఆడిన బ్యాట్ ను 18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఆ విరాళాన్ని తానాకు అందజేశారు. కొన్ని లక్షల డాలర్లు తానా సంస్థ కార్యక్రమాల కోసం వెచ్చించడమే కాకుండా ఎక్కడ తెలుగువారి మహాసభలు జరిగినా కూడా వచ్చిన వారందరికీ మంచినీళ్లు అందించాలనే విశాలహృదయంతో లక్షలాది వాటర్ బాటిల్స్ ని ఉచితంగా పంపిణీ చేసేవారు. కరోనా సమయంలోనూ విద్యాధర్ గారపాటి తనవంతు సేవలు చేసి ‘దైవం మానుష్య రూపేణా’ అని నిరూపించుకున్నారు. విద్యాధర్ గారపాటి గతంలో తానా పబ్లిసిటీ కమిటి చైర్మన్ గా, న్యూజెర్సీ న్యూయార్క్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews