హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): నిమ్నవర్గాల బాలికల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఏర్పాటుచేసిన పాఠశాలలో చేరిన మొదటి విద్యార్థి, స్త్రీలు, నిమ్నవర్గాల ప్రజల దుస్థితి, దాని నుండి ఉపశమనం పొందు మార్గాల గురించి ‘మాంగ్ మహారాచి దుఃఖవిశాయి (1855)’ అనే పేరుతో వ్యాసం రాసి, అప్పటి వర్ణవ్యవస్థ క్రూరసమాజ కట్టుబాట్లతో పాటు పీష్వాల పరిపాలనలో వారు పడే అమానవీయ బాధలను బహిర్గతం చేసిన మొదటి విప్లవనారీ ‘ముక్తాబాయి సాళ్వే మాంగ్’.
కేవలం 3 సంవత్సరాల పాఠశాల విద్యాభ్యాసం ద్వారా 14 సంవత్సరాల వయస్సులోనే వివక్ష, అణచివేత లాంటి విస్తృత భావనలను అర్థం చేసుకొని, బలహీనవర్గాలపై ఆధిపత్య వర్గాలవారు చేస్తున్న క్రూరత్వాలను ప్రపంచానికి బహిర్గతం చేసి, విద్యా జ్ఞానమే అన్ని సమస్యలకు దివ్య ఔషధం అని మొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావురాలు ‘ముక్తా సాళ్వే. ఆమె 183వ జయంతి వేడుకలను జనవరి 8న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ తెలిపారు. అందరికి నాణ్యమైన విద్యను అందించి, ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసి, ఉత్తమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే ఉత్తమ విద్యార్ధి ఆశయాలను ముందుకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS TV & APP
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews