మునుగోడు ఉప ఎన్నిక మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు క‌లిసి చేసిన తాజా స‌ర్వేలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతుందని వెల్లడైంది. మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేశాయి. రెండో సర్వే ఫలితాలను బుధ‌వారం ప్రకటించాయి. 43 శాతం ఓట్లు సాధించడం ద్వారా అత్య‌ధిక‌ ఓటర్ల మద్దతును టీఆర్‌ఎస్‌ పొందింది. బీజేపీ 38 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 15 శాతంతో మూడో స్థానంలో ఉన్న‌ట్టు ఆ సర్వేలో వెల్లడైంది. 4 శాతం ఇత‌రులు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనున్నది.

మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సర్వే నిర్వహించారు. సర్వేలో అన్ని మండలాల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నివర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించామన్నారు. 5 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించి ఓట్ల శాతాన్ని లెక్కించినట్టు వివరించారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. బీసీలకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన పథకాలు విజయం సాధించి పెడతాయని స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలో 59 వేల మందికి రైతుబంధు సాయం అందుతున్నది. 40 వేల మందికి నెలనెలా ఆసరా పింఛను లభిస్తున్నది. ఇలా అన్నివర్గాలకు సాయం చేస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని ఓటర్లు మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.

 

By admin