• BRS అధ్యక్షులు కేసీఆర్‌కి, నాయకులకు, కార్యకర్తలకు NRI BRS UK అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి
  • త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు: అడ్వైజ‌రీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీకా

లండన్: ఇటీవల అధికారికంగా TRS పార్టీ BRSగా మారిన సందర్భంగా అధ్యక్షులు కేసీఆర్‌కి, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై BRS UK అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు.
నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మొట్టమొదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్‌లో ఎగురువేసి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధనకోసం వారి వెంట నడిచామో, అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన BRS పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని, నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారని, ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని అశోక్ గౌడ్ తెలిపారు.

యూకేలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని వారందరిని ఆహ్వానిస్తూ, అలాగే భారత్ నుండి బీఆర్ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తమని అడ్వైజ‌రీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీకా తెలిపారు. “దేశ్ కి నేత కేసీఆర్” “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది.

కేసీఆర్ ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. మైళ్ళ దూరంలో ఉన్నా నాడు టీఆర్ఎస్ ఉద్యమ జెండా, నేడు దేశ గతిని మార్చే మరో ఉద్యమ బీఆర్ఎస్ జెండా మోసే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు కేసీఆర్, కేటీఆర్ కి కార్యదర్శి సత్య చిలుముల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృద్వి రావుల, మధు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV & APP
http://swadesam.com/
NRIల‌కు గుడ్‌న్యూస్. మీకు ఇండియా(తెలుగు రాష్ట్రాల‌లో) ఎలాంటి స‌ర్వీసు అవ‌స‌రం ఉన్నా ఈ వెబ్‌సైట్‌లో డీటైల్స్‌తో మెసెజ్ పెట్టండి. ఇండియాలో ఉన్న స్వ‌దేశం స‌ర్వీసు టీంతో త్వ‌ర‌గా స‌ర్వీసు పొందండి. www.swadesam.com

 

 

By admin