హైదరాబాద్ (మీడియా బాస్ నెట్‌వర్క్):
సృజనాత్మకత, నైపుణ్యం, చైతన్యాన్ని ప్రదర్శిస్తూ పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగాపద్మజ మానెపల్లికి నారీ స్పందన 2022 పురస్కార్ అందించి సత్కరించారు. ”సమాజ శ్రేయస్సు – స్త్రీ మహోన్నతమైన పాత్ర” అనే అంశంపై ఈ కార్యక్రమం హైదరాబాద్ హోటల్ గ్రీన్ పార్క్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను పురస్కారలతో సత్కరించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.