బెంగుళూరు (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
ప్ర‌ముఖ తెలుగు కథా రచయితలు పెద్దింటి అశోక్, నక్షత్రం వేణుగోపాల్ రాసిన క‌థ‌ల సంపుటిలు క‌న్న‌డ భాష‌లో అనువాద‌మై విడుద‌ల‌య్యాయి. పెద్దింటి అశోక్ రాసిన ‘జాల‌’, వేణు న‌క్ష‌త్రం రాసిన క‌థ‌ల సంపుటి ‘మౌన‌సాక్షి’ పుస్త‌క సంపుటిల‌ను కన్నడ అనువాదకురాలు, రచయిత్రి ఎంజీ శుభమంగళ క‌న్న‌డ‌లోకి అనువ‌దించారు. బెంగుళూరులోని ర‌వీంద్ర క‌ళాక్షేత్ర – నయన ఆడిటోరియంలో జ‌రిగిన ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్రముఖ రచయితలు డాక్టర్ ఆర్.పూర్ణిమ చాహా రఘునాథ్, డాక్టర్ జి.రామకృష్ణ చేతుల మీదుగా పుస్త‌కాల‌ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పెద్దింటి అశోక్, ప్ర‌వీణ్ దొడ్డ‌, మంజునాథ్, ప‌లువురు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ర‌చ‌యితలు పెద్దింటి అశోక్, వేణు న‌క్ష‌త్రం ల‌ను ప‌లువురు అభినందిస్తున్నారు. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి ర‌చ‌న‌లు పలు భార‌తీయ భాష‌ల్లోకి అనువాద‌మ‌వ్వాల‌ని అభిలాషిస్తున్నారు. వంశీ ప‌బ్లికేష‌న్స్ ద్వారా ఈ క‌థ‌ల సంపుటిలు బుక్ బ్ర‌హ్మ డాట్ కాం bookbrahma.com/book/mounasakshi ద్వారా లభిస్తాయి.

 

https://www.facebook.com/BookBrahmaKannada/videos/399932285107134

 

By admin