బ్యానర్ : గోల్డెన్ గ్లోరి బ్యానర్
హీరో ,హీరోయిన్ : అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్
దర్శకత్వం : AJ సుజిత్
నిర్మాతలు : J. సుజిత్, A బాబు
సహ నిర్మాత : కె లక్ష్మీ కాంత్
సంగీతం : శ్రీకాంత్‌ దేవా
నిర్మాణ నిర్వాహణ : సి.హెచ్‌ సీతారామ్
డిఓపి : షా
ఎడిటర్ : కె.ఇత్రిస్
మాటలు : యస్ మోహన్ కుమార్
స్టంట్ : డేంజర్ మణి
డ్యాన్స్ : రవిదేవ్
ఆర్ట్ : N నందకుమార్
గానం : చెరువూరి విజయకుమార్ , శ్రేష్ఠా
పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్

“ప్రియమైన ప్రియ” అంటూ ఓ స‌స్పెన్స్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గోల్డెన్ గ్లోరి బ్యానర్‌పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంట‌గా A J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ప్రియమైన ప్రియ”. J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆగ‌స్టు 4న‌ థియేటర్‌లలో ఘనంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.

క‌థ‌:
ప్రియా(లీషా ఎక్లెయిర్స్) రేడియో మిర్చిలో రేడియో జాకీగా ప‌ని చేస్తుంది. “ప్రియమైన ప్రియ‌” అనే స‌క్సెస్‌ఫుల్ ప్రొగ్రామ్‌ని ర‌న్ చేస్తుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్రియా చెప్పే మాట‌ల‌కు అనాధ అయిన‌ టాక్సీ డ్రైవర్ మార్కెండేయ (అశోక్ కుమార్) విప‌రీతంగా అభిమానం పెంచుకుంటాడు. ఆ అభిమానం అతి అయిపోవ‌డంతో ప్రియా జీవితం ప్ర‌మాదంలో ప‌డుతుంది. అభిమానం ప్రాణాల మీద‌కు తెస్తుంది. అత‌డు ఎందుకు అంతలా అభిమానం పెంచుకుంటాడు? చివ‌రికి ప్రియాకు ఎదురైన ప‌రిణామాలు ఏంటీ? అనేది చూడాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
ఈ సినిమా అంతా హీరోయిన్ ప్రియా పాత్ర‌లో న‌టించిన లీషా ఎక్లెయిర్స్ చుట్టే తిరుగుతుంది. ఆమె యాక్టింగ్ నిజంగా సూప‌ర్ అనే చెప్పాలి. ఒక రేడియో జాకీగా ఎంత చ‌లాకీగా ఉండాలో అంత‌లా ఫ‌ర్మార్మెన్స్ చూపించింది. ఎమోష‌న్స్ కూడా పండించింది. మరో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అశోక్ కుమార్ కూడా త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టేశాడు. అటు హీరోగా, ఇటు విల‌న్‌గా అన్న‌ట్టు రెండింటిని ఒకే పాత్ర‌లో న‌టించి కొత్త ప్ర‌యోగం చేసి స‌క్సెస్ అయ్యాడు. ఇక మిగ‌తా పాత్ర‌లు ప‌ర‌వాలేదు.

టెక్నిక‌ల్ టీమ్:
ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా అందించిన‌ సంగీతం ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు. ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100వ చిత్రం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. చెరువూరి విజయకుమార్, శ్రేష్ఠా పాడిన పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. ఇక విజువ‌ల్ ప‌రంగానూ సూప‌ర్ అనే చెప్పొచ్చు. డీఓపీ అందించిన ‘షా’కు కూడా మంచి మార్కులు వేయ‌వ‌చ్చు. మాట‌లు రాసిన ఎస్. మోహన్ కుమార్ అక్క‌డ‌క్క‌డ కొన్ని జీవిత సూత్రాలు చెప్పాడు. ఇక ఎడిటింగ్ ప‌రంగా చూస్తే ఎడిటర్ కె.ఇత్రిస్ ప‌నిత‌నం ప‌ర‌వాలేదు. నిర్మాత‌లు J.సుజిత్, A.బాబు చిత్ర నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశార‌ని అర్థ‌మ‌వుతుంది.

విశ్లేష‌ణ‌:
తమిళ్‌లో తెర‌కెక్కిన “ప్రియముడన్ ప్రియ” చిత్రం.. తెలుగులో “ప్రియమైన ప్రియ” టైటిల్‌తో విడుద‌లైంది. స్క్రీన్ ప్లే సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. డైరెక్ట‌ర్ A J సుజిత్ తాను రాసుకున్న క‌థ‌ను స్క్రీన్‌పై చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ప్రారంభం నుంచి చివ‌రి దాక ఉత్కంఠ‌ను కొన‌సాగించ‌డంలో ద‌ర్శ‌కుడు A J సుజిత్ త‌న టాలెంట్ చూపించాడు. అయితే కామెడీ కొంచెం ఉండాల్సింది. థ్రిల్లింగ్ సీన్‌లు సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాయి. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. ఈ సినిమాను అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడొచ్చు. ముఖ్యంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కోరుకునే వారికి ఈ సినిమా ఇంకా బాగా న‌చ్చుతుంది.

రేటింగ్: 3.5 /5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin