పటాన్ చెరుపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలి: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ వైపు ధర్మం ఉంటే..BRS వైపు అధర్మం ఉంది
మహిపాల్ రెడ్డికి ఈ పదేళ్లలో వేల కోట్లు ఎలా వచ్చాయి.?
భూకబ్జాదారు మహిపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి
ఇందిరమ్మ పాలనలోనే పటాన్ చెరు అభివృద్ధి చెందింది
రేవంత్ రోడ్ షోతో జనసంద్రంగా మారిన పటాన్ చెరు
పటాన్ చెరు ప్రజలంతా కాంగ్రెస్ వైపే: కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు ప్రజలకు నా పాదాభివందనాలు
గూడెం మహిపాల్ రెడ్డి డబ్బు మదం..మాది ప్రజాబలం
కాంగ్రెసు కేడరే నన్ను ముందుకు నడుపుతుంది: కాట శ్రీనివాస్
BRS వెయ్యికోట్లు పెట్టినా కాంగ్రెసు గెలుపును ఆపలేరు
ప్రజా ఆశీస్సులతో పటాన్ చెరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా: కాట శ్రీనివాస్
బ్రేకింగ్ న్యూస్: భూకబ్జాదారు గూడెం మహిపాల్ రెడ్డిని పటాన్ చెరు నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థి, యువనేత కాట శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్లలో గూడెం మహిపాల్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కబ్జాకోరు మహిపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పటాన్ చెరు ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ పాలనలోనే పటాన్ చెరు అభివృద్ధి చెందిందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం పరిస్థి ఏంటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కు ఈ నెల 30న తగిన గుణపాఠం చెప్పాలన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడబోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. పటాన్ చెరు యువకిషోరం కాట శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
BRS అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు చేసిన పటాన్ చెరులో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు ఆ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్. మహిపాల్ రెడ్డికి డబ్బు మదం ఉంటే.. తనకు ప్రజాబలం ఉందన్నారు. పటాన్ చెరు ప్రజలకు ఆయన పాదాభివందనాలు తెలియజేశారు. కాంగ్రెసు కేడరే తనకు కొండంత బలమని.. వాళ్లే నన్ను ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రజా ఆశీస్సులతో పటాన్ చెరులో కాంగ్రెసు జెండా ఎగరేస్తానని కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ రోడ్ షోలో ఏఐసీపీ సెక్రటరీ విష్ణునాథ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, సంగారెడ్డి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r