విడుద‌ల‌: డిసెంబ‌ర్ 2
బ్యాన‌ర్: కౌశల్ క్రియేషన్స్
నిర్మాత‌లు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు
ద‌ర్శ‌క‌త్వం: నిర్ణయ్ పల్నాటి
న‌టీన‌టులు: కోలా బాలకృష్ణ (హీరో),
తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ త‌దిత‌రులు

టాలీవుడ్ స్క్రీన్‌పైకి మ‌రో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ వ‌చ్చేసింది. భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నేనెవరు”. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కింది. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇవ‌ల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం!!

కథ:
క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరూ గొడవపడి విడిపోతారు. అనుకోకుండా త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ చిత్ర దూరం కావడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు క్రిష్. అయితే అదే సమయంలో తన మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్).. జీకే (బాహుబలి ప్రభాకర్), తన మేనత్త అనుచరుడు నాయుడు వరుసగా హత్యలకు గురవుతారు. మరోవైపు క్రిష్ మాత్రం తన ప్రేయసిని తలచుకుంటూ.. తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ.. కనిపించిన వారికి అంతా తన లవ్ స్టోరీ చెబుతూ తిరిగేస్తూ వుంటాడు. మరి తన జీవితం నుంచి వెళ్లిపోయిన చిత్ర మళ్ళీ వ‌స్తుందా లేదా? ఆ వరుస హత్యలకు కారణం ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:
హీరోగా నటించిన కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగా చాలా బాగా న‌టించాడు. రివెంజ్ డ్రామాలో మాస్ ను మెప్పించే ఫ‌ర్మార్మెన్స్ చూపించాడు. అతనికి జంటగా ల‌వ‌ర్ పాత్రలో గీత్ షా.. చక్కగా కుదిరింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగా, కాస్త సైకోలా బిహేవ్ చేసే పాత్రలో న‌టించి మెప్పించింది. అలాగే హీరో మరదలిగా తనిష్క్ రాజన్ ప‌ర‌వాలేదు. ఆమె అమ్మగా లేడి దాధాగా నటించిన నటి కూడా బాగా చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాక్షి చౌదరి అదరగొట్టిందనే చెప్పాలి. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చెలరేగి నటించింది. బాహుబలి ప్రభాకర్ జి.కె.పాత్రలో విలన్ గా. హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

విశ్లేషణ:
నిజానికి సినీ ల‌వ‌ర్స్‌కు ప్రేమతో ముడిపడిన క్రైం థ్రిల్లర్ లు అంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి కథలు వ‌చ్చిన సినిమాల‌ను ఆద‌రిస్తారు. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే గ్రిప్పింగ్ కథ, కథనాలతో లవ్, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాను డైరెక్ట‌ర్ నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికడిగా, తాగుబోతుగా చూపించి, ఆ తరువాత మర్డర్ మిస్టరీని ఛేదించిన ట్విస్టు ఆడియ‌న్స్‌ను థ్రిల్ కి గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను కట్టి పడేస్థాయి. దర్శకుడు రొటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించడంలో స‌క్సెస్ అయ్యాడు. డైరెక్ట‌ర్ నిర్ణయ్ పల్నాటి రాసుకున్న కథ, కథనాలు గ్రిప్పింగ్ గా… ఎంగేజింగ్ గా వున్నాయి. ఆర్.జి.సారథి అందించిన సంగీతం సీన్స్ ను ఎలివేట్ చేశాయి. ఓ రెండు ట్యూన్స్ మాత్రం చాలా రోజుల పాటు మనలను వెంటాడతాయి. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్స్ కి కావలసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వ‌చ్చింది. ఇక‌ కోలా భాస్కర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి పెద్ద బలం. కథ, కథనాల పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, అవేవీ సినిమాను ఆస్వాదించడంలో మనలను ఇబ్బంది పెట్టవు. సినిమాటోగ్రఫీ సూప‌ర్. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. క‌థ‌కు త‌గిన స్థాయిలో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. మొత్తానికి మూవీ ల‌వ‌ర్స్ చూడ‌ద‌గిన ల‌వ్ ఆండ్ క్రైం థ్రిల్లర్ ‘నేనెవరు’.

రేటింగ్: 3.25/5

By admin