సెన్సార్ రేటింగ్: U/A
జెనర్: ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ ట్రిల్లర్ & సస్పెన్స్
విడుదల తేదీ : 18-11-2022
ప్రధాన పాత్రలు: విక్రమ్‌గా అభినవ్ సింగ్ రాఘవ్
వైష్ణవిగా గజాల
నక్షత్రగా నైనా శర్మ
అజయ్‌గా ఇషాన్ యాదవ్
మనోహర్‌గా పృద్వి దండముడి
మంత్రిగా మారుతీ సకారం
సంజయ్‌గా మున్నా
కార్తీక్‌గా జయంత్
రాహుల్‌గా రంజీత్
శివగా శ్రీరామ్

క్రూ సభ్యులు:
నిర్మాత: నడిగడ్డ రాజసులోచన
రైటర్ & డైరెక్టర్: మోక్షు
కంపోజర్: SS రాజేష్ & మోక్షు
సినిమాటోగ్రఫీ: పిఎల్ రామ్ ప్రసాద్
ఆడియోగ్రఫీ: దేవికృష్ణ కడియాల (రామానాయుడు స్టూడియో)
ఎడిటర్: మోక్షు

టాలీవుడ్ తెర‌పైకి మ‌రో క్రైమ్ థ్రిల్లర్ వ‌చ్చేసింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం ‘PLAY’. నడిగడ్డ రాజసులోచన నిర్మాణంలో డైరెక్ట‌ర్ మోక్షు తెర‌కెక్కించిన ‘ప్లే’ చిత్రం ఎన్నో అంచ‌నాల‌తో న‌వంబ‌ర్ 18న విడుద‌లైంది. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? సినిమాలో ఎలాంటి ప్ర‌యోగం చోటు చేసుకుంది? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థః
ఆదివారం రాత్రి, డ్యూటీలో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన కథానాయకుడు విక్రమ్‌(అభినవ్ సింగ్ రాఘవ్)కి శంషాబాద్ ఫామ్‌హౌస్‌లో హత్య జరిగిందని త‌న కింది అధికారుల నుంచి కాల్ వస్తుంది. ఫామ్‌హౌస్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అతనికి సిటీలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కిడ్నాప్‌లు, హత్యలు ఇలా వ‌రుస‌గా కాల్స్ వస్తాయి. విక్రమ్ అయోమయంలో పడుతాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రతి హత్య, కిడ్నాప్ చాలా వ్యూహాత్మకంగా జరిగేవి. అకస్మాత్తుగా అతని టీమ్‌తో కలిసి ఈ పనులన్నీ చేస్తున్న విరోధి శివ(శ్రీరామ్) నుండి అతనికి కాల్ వస్తుంది. చాలా టాస్క్‌లను పరిష్కరించడానికి విక్రమ్‌కి శివ “ఆరు” గంటల సమయం ఇస్తాడు. శివ ఈ పనులన్నీ ఎందుకు చేస్తాడు? హత్య, కిడ్నాప్ మిస్టరీలను ఒక్క రాత్రిలో విక్రమ్ ఎలా ఛేదించాడు? అనే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులుః
ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర విక్ర‌మ్‌. ఈ ఛాలెజింగ్ రోల్‌ను అభినవ్ సింగ్ రాఘవ్ చాలా బాగా చేశాడు. సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాడు. ఇక శివ పాత్ర‌లో శ్రీ‌రామ్ ఫ‌ర్మార్మెన్స్ అదిరిపోయింది. ఇక వైష్ణవిగా గజాల, నక్షత్రగా నైనా శర్మ, అజయ్‌గా ఇషాన్ యాదవ్, మనోహర్‌గా పృద్వి దండముడి, మంత్రిగా మారుతీ సకారం, సంజయ్‌గా మున్నా, కార్తీక్‌గా జయంత్, రాహుల్‌గా రంజీత్.. త‌మ‌త‌మ పాత్ర‌ల్లో ప‌ర‌వాలేద‌నిపంచారు.

టెక్నిక‌ల్ః
టెక్నిక‌ల్ ప‌రంగా అన్ని విభాగాల‌ను స‌రిగ్గా వాడుకోవ‌డంలో డైరెక్ట‌ర్ మోక్షు స‌క్సెస్ అయ్యాడు. రైటింగ్, డైరెక్ష‌న్‌తో పాటు కంపోజింగ్, ఎడిటింగ్‌లోనూ స్వ‌యంగా వ‌ర్కు చేసి సూప‌ర్ అనిపించాడు మోక్షు. క్రైమ్ థ్రిల్లర్‌కు త‌గ్గ‌ట్టుగానే చూపించ‌డంలో సినిమాటోగ్రాఫర్ పిఎల్ రామ్ ప్రసాద్ వ‌ర్క్ బాగుంది. గంట‌కుపైగా ఉన్న గ్రాఫిక్ సీన్‌లు, న్యూఏజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రివర్స్ స్క్రీన్ ప్లే.. వంటివి సినిమాకు ప్ర‌ధాన హైలైట్స్‌గా చెప్పుకోవ‌చ్చు. మేకింగ్ విజువల్స్, రేసీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు ఊపిరి బిగ‌ప‌ట్టేలా చేస్తాయి.

విశ్లేష‌ణః
PLAY క్రైమ్ థ్రిల్లర్ రివెంజ్ లవ్ స్టోరీ. సినిమాలో ఇది ఒక్క రాత్రిలో జరిగిన క‌థ‌ను చూపించారు. ఆద్యంతం ఆస‌క్తిక‌లిగించే క‌థ‌నంతో న‌డుస్తుంది. రివెంజ్ లవ్ స్టోరీని క్రైమ్ థ్రిల్లర్‌గా రాసుకుని డైరెక్ట‌ర్ మోక్షు త‌ను అనుకున్న‌ది తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఎక్క‌డ రాజీప‌డ‌కుండా క‌థ‌కు త‌గిన రీతిలో బ‌డ్జెట్ పెట్టినట్టు స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. కొత్త‌ర‌కం గ్రాఫిక్స్, రివర్స్ స్క్రీన్ ప్లే.. కొత్త అనుభూతిని ఇస్తాయి. మొత్తానికి సినిమాల ల‌వ‌ర్స్‌కు PLAY చాలా బాగా న‌చ్చుతుంద‌నే చెప్పొచ్చు.

రేటింగ్: 3.5 / 5

By admin