ప్రేక్ష‌కుల‌కు నాచుర‌ల్ కామెడీ అందిస్తే ఏ సినిమానైనా ఆద‌రిస్తారు. అలాంటి కోవ‌లో వ‌చ్చిన సినిమా ‘తురుమ్‌ ఖాన్‌లు’. సినిమాలో అంతా కొత్త‌వారే. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాత కూడా తొలి ప‌రిచ‌య‌మే. అయితేనేం తురుమ్ ఖాన్ లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ చీఫ్ గెస్టుగా పాల్గొన‌డంతో ఈ సినిమాపై అంద‌రి చూపు ప‌డింది. తాజాగా థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.

కథః
ఇది పక్కా తెలంగాణ చిత్రం. మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కింది. తుపాకుల గూడెం అనే ఊర్లో జరిగే కథ. శంకర్(నిమ్మల శ్రీరామ్) యూత్ లీడర్, మరదలు లలిత (ఐశర్య ఉల్లింగాల)తో కరోనాలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వీరాజ్ బ్రహ్మ(దేవరాజ్ పాలమూర్) అందరూ బ్రహ్మం అని అంటారు. సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. అయినా పెళ్లి కాలేదు అంటూ అందరు ఎగతాళి చేస్తే.. తన స్వ‌భావంతో అందరిని తిడుతుంటాడు. ఊర్లోకి వచ్చింది మొదలు తాగుడే పనిగా పెట్టుకుంటాడు. తాను కూడా పెళ్లి చేసుకోవాలను కుంటాడు. విష్ణు(అవినాష్ చౌదరి) కాలేజ్‌లో లవ్ పద్మతో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో ఊరిలో లాక్ డౌన్ విధిస్తారు. ఆ స‌మ‌యంలోనే జరుగునున్న శంకర్ పెళ్లి ఆగిపోతుంది. పద్మ, విష్ణులను కలపడానికి స్వప్న సాయం చేస్తుంది. అదే క్రమంలో స్వప్న విష్ణుపై మనసు పడుతుంది. ఇక బ్రహ్మం భారతి(విజయ)తో ఎఫైర్ పెట్టుకోవాలను కుంటాడు. ఈ ముగ్గురు చుట్టు కథే తురమ్ ఖాన్‌లు సినిమా. శంకర్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? విష్ణు, పద్మ కలిశారా? స్వప్న క‌థేంటీ? బ్రహ్మం, భారతి ఎఫైర్ ఎలాంటి మ‌లుపు తిరిగింది? అసలు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంట‌నేదే ఈ సినిమా క‌థ‌.

నటీనటులు ప్ర‌తిభః
ఈ సినిమాలో న‌టించిన నటీనటులు అంతా కొత్తవాళ్లే. కానీ సినిమా చూస్తున్నంత సేపు వాళ్లు మ‌న‌లో కొంద‌రు అన్న‌ట్టుగా వాళ్లతో ట్రావెల్ అవుతాము. సినిమాలో శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల యాక్టింగ్ వెరీ సూప‌ర్ అని చెప్పొచ్చు. అలాగే జబర్దస్థ్ ఐశర్య గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ చాలా చ‌క్క‌గా కుదిరాడు. అసలు ఆయన రియల్ గా కూడా ఇలానే ఉంటాడేమో అన్నంత‌ సహజంగా చేశాడు. ఇక భారతి తన స్క్రీన్ స్పేస్ లో ఆక‌ట్టుకుంటుంది. ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది. ఇక షేట్ క్యారెక్టర్, బుగ్గ, ట్రాక్టర్ డ్రైవర్, అలాగే బ్రహ్మం తండ్రి పాత్ర చేసిన వారు కూడా మంచి యాక్టింగ్‌ కనబరిచారు.

టెక్నికల్ః
ఎన్ శివ కళ్యాణ్ తాను తెర‌కెక్కించాల్సిన‌ కథను ప‌ర్‌ఫెక్టుగా చూపించాడు. చివరివ‌ర‌కు ఎంగేజ్ అయ్యేలా కథతో పాటు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. డైరెక్ట‌ర్‌గా కొత్త వాడైన‌ప్ప‌టికీ ఎంతో ప‌రిణితి చూపించాడు. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుంచి కూడా స‌రైన అవుట్‌ఫుట్ తీసుకున్నాడు డైరెక్టర్. ఇక సినిమాకు హైలైట్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సంద‌ర్భానికి తగ్గట్టుగానే పాటలు సూప‌ర్. ఇక‌ నాగేశ్వర్ రెడ్డి బొంతల చేసిన ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో షార్ఫ్ అయితే, సెకండాఫ్‌లో కాస్త క‌ట్ చేయాల్సి ఉండేది అనిపిస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీని సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ చూపించిన విధానానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించిన ఎండి ఆసిఫ్ జానీ క్వాలిటీగా నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

విశ్లేష‌ణః
విలేజ్ బ్యాగ్ డ్రాఫ్ లో కథ కాబట్టి చాలా నాచుర‌ల్‌గా తెరకెక్కించి ప్రేక్ష‌కుడిని మెప్పించాడు డైరెక్ట‌ర్. అచ్చం మన ఊర్లో జరిగే కథను చూసిన అనుభూతి కలుగుతుంది. కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టినప్పటి రోజులను ఈ సినిమా గుర్తుకు తెస్తుంది. నాన్‌స్టాప్ కామెడీ డైలాగులతో ప్రేక్షకులు న‌వ్వించ‌డంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాలో శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే కథను ఎంతో ఫన్నీగా తెరపై ఆవిష్కరించాడు. తొలి నుంచి చివరి వరకు థియేట‌ర్ అంతా న‌వ్వులు ఉంటాయ‌ని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ చాలా హూషారుగా సాగిపోతుంది. సెకండ్ కాస్త నెమ్మదించిన మళ్లీ అదే జోరులో సాగుతుంది. ఇంటర్వేల్ సీన్ చాలా ఉత్కంఠ భరితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూసిన తరువాత ప్రేక్ష‌కుడికి మంచి ఫీలింగ్ కలిగేలా చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. మ‌రెందుకాల‌స్యం థియేట‌ర్‌కు వెళ్లి తురుమ్‌ ఖాన్‌లను చూస్తు న‌వ్వుకోవ‌డానికి.

రేటింగ్: 3.5/5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin