◾️రూపురేఖలు మారుతోన్న అర్బన్‌ ‘హస్తం’ పాలిటిక్స్‌

◾️అందరి దృష్టి డాక్టర్‌ శివ ప్రసాద్‌పైనే 

◾️పద్మశాలి ఓట్లు, బీసీ సెంటిమెంట్

◾️సర్వేల్లో కొత్త మార్పులు 

(లక్ష్మి – నిజామాబాద్ ప్రతినిధి):

నిజామాబాదు కాంగ్రెస్ కొత్త రక్తం నింపుకుంటోంది. గెలుపు గుర్రాలకు ప్రయార్టీ ఇస్తోంది. ఈ క్రమంలో నిజామాబాద్ కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల స్థానిక పరిస్థితులు చూస్తే ధర్మపురి సంజయ్‌పై జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కోల్ద్ వార్ కనిపిస్తోంది. సంజయ్ తీరు నచ్చని సీనియర్‌ నేతలంతా అయనకు అర్బన్‌ టికెట్‌ రాకుండా అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ కార్డుతో, తండ్రి పలుకుబడితో అధిష్టానం వద్ద తనకు హామీ లభించిందని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న తీరును సీనియర్ నేతలు సహించడం లేదు.

ఎలాగైనా సంజయ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసి.. బీసీకార్డు మీదే ప్రత్యామ్నాయ అభ్యర్థిని మరొకరిని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. పద్మశాలి సామాజికవర్గం నుంచి బీఆరెస్‌లో ప్రస్తుతం నుడా డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ సందా శివప్రసాద్‌కు గాలం వేశారు.

మొన్న జరిగిన పద్మశాలి ఎన్నికల గెలుపులో శివప్రసాద్‌ కీలకంగా వ్యవహరించి తన సామాజికవర్గంలో సత్తా చాటుకున్నాడు. అర్బన్‌లో మున్నూరుకాపులు, పద్మశాలీల ఓటర్లు అధికంగా ఉన్నారు. గతం కంటే ఈ సారీ బీసీ కాన్సెప్ట్‌ ఇక్కడ బలంగా వినిపిస్తోంది. మహేశ్‌కుమార్ గౌడ్‌, తాహెర్ లు ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ పార్టీ మరింత జోష్ పుంజుకోవాలంటే పాత నాయకులతో కాని పని. అందుకే కొత్త అభ్యర్థిని ఎంచుకోవాలనే అన్వేషణలో భాగంగా వారికి శివప్రసాద్ కనిపించాడు. సర్వేల్లోను అదే ఫలితం. సంజయ్‌కు చెక్‌ పెట్టేలా బీసీ నుంచే మరో బలమైన సామాజికవర్గం నుంచి కొత్త ముఖం కావాలనుకుంటే శివప్రసాద్‌ కనిపించాడు. ఇక ఇప్పుడు మొదలైంది.. అసలు సిసలు వార్ అంటూ జోష్ మీదున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP www.hyStar.in లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.
 

 

 

By admin