మా.. మా.. మ‌హేశా అంటుండ‌గా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంట్రీ ఇచ్చేశాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్ట‌ర్ పరుశురామ్ మహేష్ ని ఓ రేంజ్‌లో దింపేసిన మూవీ స‌ర్కార్ వారి పాట. మ‌రి ఈ సినిమాతో మ‌హేష్ మ‌రో హిట్ అందుకున్నాడా? గతంలో స్టార్స్‌తో మూవీ చేసిన అనుభవం లేని డైరెక్టర్ పరుశురామ్ మహేష్ ని ఎలా డీల్ చేశాడు? ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

ముందుగా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో మహేశ్ బాబు పేరు కూడా మహేశే.. కాకపోతే అందరూ ముద్దుగా మహీ అని పిలుస్తారు. అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. ఈ తరుణంలో అమెరికాలో చ‌దువు కోసమ‌ని వెళ్లిన క‌ళావ‌తి పాత్ర‌లో న‌టించిన కీర్తిసురేష్‌.. మహేష్ ద‌గ్గ‌ర అబ‌ద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. కొన్ని రోజుల్లోనే కళావ‌తి అస‌లు రూపం మహేష్ కు తెలిసిపోతుంది. దాంతో త‌న అప్పు త‌న‌కి తిరిగిచ్చేయ‌మ‌ని అడుగుతాడు. ఆమె తీర్చ‌న‌ని చెప్పేస‌రికి విశాఖ‌ప‌ట్నంలో ఉన్న క‌ళావ‌తి తండ్రి రాజేంద్ర‌నాథ్ పాత్ర‌లో న‌టించిన సముద్ర‌ఖ‌ని ద‌గ్గ‌రికి బ‌య‌ల్దేర‌తాడు. ఆలా వైజాగ్ కు వెళ్లిన మహేష్ తన డబ్బును రాబట్టుకున్నాడా.. లేదా..? అసలు మహేష్ కు కళావతి గురించి తెలిసిన నిజాలు ఏంటి..? తదితర విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాను ఒన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేశ్ మాత్రం జీవించేశాడు. మహేశ్ మాస్ డైలాగ్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా అద్దిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్‌ల‌లో మహేశ్ ఎనర్జీ కూడా సూపర్బ్ అనిపించింది. కీర్తి సురేశ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కమెడియన్ గా వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడు. సముద్రఖని.. తన విలనిజాన్ని పండించాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాకు ముందే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు స్క్రీన్ మీద మరింత బెస్ట్ గా కనిపించాయి. ఓవర్ ఆల్ గా పరుశరామ్ టేకింగ్‌తో పాటు ప్రేక్షకులకు సరికొత్త మహేశ్ బాబును పరిచయం చేశాడు.

ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే..
సినిమాకు ప్లస్ పాయింటే మహేశ్ బాబు. ఆయన లేని సినిమాను ఊహించలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, కామెడీ, హీరోయిన్ కీర్తి.. వీళ్లంతా సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యారు.

ఇక మైనస్ పాయింట్స్ చూస్తే..
ప‌లుచ‌ప‌డిన క‌థనం, అక్క‌డ‌క్క‌డ లాజిక్‌లు మిస్ అవుతాయి. అలాగే.. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు.

బ్యాంకు రుణాలు, చెల్లింపుల విషయంలో మధ్య తరగతివాడికి ఎలాం టి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఆ వ్యవస్థపై పెద్దోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, దాన్ని కథతో ముడిపెట్టిన విధానమే అంతగా అతకలేద‌నిపిస్తుంది. మహేశ్ గతాన్ని ఆవిష్కరిస్తూ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కథ అమెరికాకి మారుతుంది. అక్కడ అప్పులిచ్చే ఫైనాన్షియర్‌గా మహేశ్, చదువుకునే అమ్మాయిగా కళావతి పాత్రలు పరిచయం అవుతాయి. వాళ్లిద్దరికీ, వెన్నె ల కిషోర్‌కి మధ్య సీన్‌ల‌తో సినిమా ఎంట‌ర్‌టైన్‌గా ఉంటుంది. పాటలు కూడా అలరిస్తాయి. పాటలు, ఫైట్లు, హాస్యంతో.. సెకండాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. కళావతిగా కీర్తిసురేష్ తన అందంతో కట్టిపడేసి, మహేశ్‌కు తగ్గ జోడీ అనిపించింది. అప్పు వసూలు చేయడం కోసం మహేశ్ ఇండియాకి బయల్దేరడం దగ్గరి నుంచే అసలు కథ మొదలవుతుంది. పది వేల డాలర్లు వసూలు చేయడం కోసం హీరో ఇండియాకి రావడమా అనే సందేహం రావొచ్చు కానీ, ఆ పాత్రని డిజైన్ చేసిన విధానమే అలా ఉంటుందని సరిపెట్టుకోవాలి. సినిమాలో అలా చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండానే సాగుతాయి. బిజినెస్ రిలేటెడ్ సినిమాలు లాజిక్ ఆలోచించకుండా చూడాల్సిందే. కథగా చూస్తే పలచటి అంశమే. మహేశ్ శైలి మాస్ అంశాల్నే ఎక్కువగా జోడించి మధ్యలో తాను చెప్పాలనుకున్నది చెప్పాడు డైరెక్ట‌ర్. ఇక సెకండాఫ్‌ దాదాపుగా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతుంది. మహేశ్, కళావతిల మధ్య సీన్‌లు ఫ‌స్టాఫ్‌లో ఎంట‌ర్‌టైన్‌గా ఉన్నా, సెకండాఫ్‌లో పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇ.ఎమ్.ఐల గురిం చి, బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాధిస్తున్న వైనం గురించి సెకండాఫ్‌లో చెప్పిన విషయాలు మాత్రమే ఆసక్తిగా అనిపిస్తాయి. అభిమానులకి నచ్చే అంశాలు మాత్రం సినిమాలో పుష్క లం.

చివరగా చెప్పొచ్చేదేంటంటే.. మహీ పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. మాస్, క్లాస్ అభిమానులకు నచ్చేలా.. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు న‌చ్చేలా మహేశ్ ను తీర్చిదిద్దాడ‌ని చెప్పొచ్చు. మాస్ క్లాస్ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలతో తెరకెక్కిన ఫుల్ మీల్ లాంటి సినిమా.

రేటింగ్ 3/ 5

 

By admin