యూసఫ్‌గూడలోని సాయిగిరి హై స్కూల్‌లో వైస్ ప్రిన్సిపల్, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు డా .సీహెచ్ భద్ర అధ్యక్షతన క్రాంతిమాత సావిత్రిభాయి పులే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర ప్రభుత్వ పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమతా సుదర్శన్ హాజరయ్యారు. ఆయన విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో వేల సంవత్సరాలుగా శూద్రులుగా, అతి శూద్రులుగా మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తూ అణగారిన వర్గాల ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్న సమయంలో సావిత్రిభాయి పూలే జన్మించడం సమస్త మానవాళికి శుభదినం అయ్యిందన్నారు.
ఆమెకు చిన్న వయసులోనే జ్యోతిభా పూలేతో వివాహం జరిగినప్పటికీ అన్నిసమస్యలకు విద్య ఒక్కటే పరిష్కారమని సమస్త మానవాళిని ఐక్యం చేస్తూ ఈ వ్యవస్థలోని అవస్థలను జ్ఞానం ద్వారా మాత్రమే రూపగలమని జ్యోతిభా పూలే తన జీవిత భాగస్వామికి పాఠాలు నేర్పించడం జరిగిందన్నారు. విద్యతో పాటు పోరుబాటను పట్టించి ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఈ దేశంలో సామాజిక విప్లవాలకి నాంది పలకడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలు ఎస్.సి, ఎస్.టీ, బీసీ వర్గాల ప్రజలు సావిత్రిభాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలిని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పూలే చేసిన పోరాటాన్ని మననం చేసుకోవాలని కొనియాడారు. దానిని కొనసాగింపుగానే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. అంబేద్కర్ పూలేని తన గురువుగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను అధిగమించడానికి సత్యసోధక్ లాంటి సమాజాన్ని పునర్మించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు తెలిపారు.
స్కూల్ వైస్ ప్రిన్సిపల్ డా. భద్ర మాట్లాడుతూ ఈ దేశంలో జ్యోతీభా పూలే, సావిత్రిభాయి పూలే లాంటి మేధావులు జన్మించి ఉండకపోతే ఇంకా మూఢ విశ్వాసాలు, అంధ విశ్వాసాలు రాజ్యాలు ఏలేవన్నారు. ప్రతీ ఒక్కరూ కూడా దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేఖంగా ఉద్యమాలు చేయాలని ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను పాఠాలు, పోరాటాల రూపంలో భోదించాలన్నారు. అందుకోసం మా సాయిగిరి స్కూల్ ముందు వరుసలో ఉంటుందని తెలియజేసారు.
సాయిగిరి ప్రిస్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రసిడెంట్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహిస్తామని, ఆ మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామాని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టు వి. శ్రీధర్ మాట్లాడుతూ సావిత్రిభాయి పూలే గురించి చదవడం అంటే మన చరిత్రని మనం చదవడమన్నారు. బీసీ సంఘాల జాతీయ నాయకులు దయానంద్ మాట్లాడుతూ సావిత్రిభాయ్ పూలే జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం, మహనీయులను స్మరించుకోవడమే అని తెలియజేశారు. కార్యక్రమంలో సంతోష్, రాము, సావిత్రిభాయ్, జ్యోతీభా పూలే అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews