– ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీమేరకు వెంటనే ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశంను నియమించాలని, అయన ద్వారానే దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు బుడగజంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

 

గత పది సంవత్సరాలకు పైగా దళితుల్లో అత్యంత వెనుకబడ్డ ఉపకులాల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఉండాలని అన్ని ఉపకులాలను ఏకంచేసి అనేక ఉద్యమ పోరాటాలు చేసిన ఫలితంగానే నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మద్దతునిచ్చి కాంగ్రెస్ గెలుపులో భాగస్వామ్యమైందన్నారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి బైరి వెంకటేశంని చైర్మన్ గా నియమించే విషయం పై వెంటనే స్పష్టత నివ్వాలన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ ఉపకులాల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేసారు.

 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుర్తి రాజేష్ సమగర, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఔషాదం రవీందర్ గోసంగి, ఉపాధ్యక్షులు తల్వరే పరమేశ్వర్ మాంగ్ తదితరులు పాల్గొన్నారు.

By admin