నటీనటులు: ధర్మ మహేష్, శివ బాలాజీ, బ్రిడిగా సాగా, రవి వర్మ, ఆనంద చక్రపాణి, మీర్, నాగ మహేష్, దయానంద రెడ్డి తదితరులు.
దర్శకత్వం: శ్యామ్ తుమ్మలపల్లి
రచన: కిషోర్ శ్రీ కృష్ణ
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి
మ్యూజిక్: గౌవ్రా హరి
సినిమాటోగ్రఫి: కేశవ్
ఎడిటింగ్: జస్విన్ ప్రభు
బ్యానర్: శ్రీ లక్ష్మీ నర్సింహా మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2023-01-26
‘సిందూరం’ అనే టైటిల్ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమే. 1997లోనే పోలీసులు కరెక్టా..? నక్సలైట్లు కరెక్టా..? అని దర్శకుడు కృష్ణవంశీ ప్రేక్షకుడి ఊహకే వదిలేసాడు. అయితే తాజాగా విడుదలైన ‘సిందూరం’ సినిమాలో దర్శకుడు సాహసమే చేశాడు. తప్పు ఎవరిదో చెప్పేశాడు. ఇంతకీ ఈ రోజు విడుదలైన ‘సిందూరం’లో మూవీ మేకర్స్ ఏం చూపించారు..? దర్శకుడు తాను అనుకున్నటువంటి పాయింట్ ని జనాలకు చేరవేశారా..? లేదా ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
– స్వామి ముద్దం
కథ:
సిందూరం కథ అంతా కూడా 2003 ప్రాంతంలో జరుగుతుంది. శ్రీరామగిరి ఎజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వామ్యుల ఆగడాలు, దానిపై సింగన్న దళం (శివ బాలాజీ) చేసే పోరాటల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో ఫ్రెండ్స్. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో ఆడాలని కలలు కంటాడు. శిరీష ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి తన సొంత ఊరుకు ఎంఆర్‌వోగా వస్తుంది. రవి, శిరీషకు ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే ఓ కారణంగా బాడ్మింటన్ ఆటకు దూరమై ధర్మ నక్సల్స్ సానుభూతిపరుడిగా మారుతాడు. ఉద్యోగాన్ని వదిలేసి శిరీష రాజకీయాల్లోకి వస్తుంది. అయితే శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది. ధర్మ బాడ్మింటన్ ఆటకు దూరమై నక్సల్స్‌తో ఎందుకు చేతులు కలిపాడు? శిరీష ఎంఆర్వో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి చేరింది? నక్సల్స్‌ను, ధర్మను మార్చేందుకు శిరీష ఎందుకు ప్రయత్నించింది? నక్సల్స్‌తో చేతులు కలిపిన తర్వాత ధర్మ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కథలో రైతుకూలి సంఘం నాయకుడు నరసింహంను, రాజకీయ నేత ఈశ్వర్ రెడ్డి (రవివర్మ)ను ఎవరు హత్య చేశారు. పోలీసులకు, నక్సల్స్ మధ్య పోరాటం వల్ల గ్రామస్థులు ఎలా నలిగిపోయారు? చివరకు ధర్మ, శిరీష ఒక్కటయ్యారా? నక్సల్స్, పోలీసుల పోరాటానికి ఎవరెవరు బలయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానమే సిందూరం సినిమా కథ.
నటీనటులు:
సిందూరం కథకు తమిళనటి బ్రిగిడ సాగా నటన ప్లస్ పాయింట్. పాత్ర ఎంతో బరువుగా అనిపిస్తున్నా కూడా శిరీషగా బ్రిగిడ చాలా బాగా నటించి మెప్పించింది. విద్యార్థిగా, ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయ నేతగా, సమాజాన్ని ఉద్దరించాలనే తపన ఉన్న యువతిగా చాలా వేరియేషన్స్ ఉన్న రోల్‌ను సమర్ధవంతంగా పోషించింది. ఇక రవి కారెక్టర్‌లో ధర్మ చక్కగా కుదిరాడు, ఎమోషన్స్ కూడా బాగా పలికించాడు. క్లైమాక్స్‌లో రవి పాత్రలో ధర్మ చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్టింగ్ అందరినీ కదిలిస్తుంది. ధర్మకు ఫస్ట్ మూవీ అయినా కూడా భారమైన పాత్రను సక్సెస్‌ఫుల్‌గా పోషించడమే కాకుండా ప్రేక్షకులపై ఇంపాక్ట్ కూడా తెచ్చేలా నటించాడు. స్క్రీన్‌పై ఈ జంట చక్కగా కుదిరింది. ఇక శివబాలాజీ చాలా కొత్తగా కనిపిస్తాడు. దళ నాయకుడు సింగన్నగా శివ బాలాజీ ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారుతాడు. ఆయన హావభావాలు, కీలక సన్నివేశాల్లో యాటిట్యూడ్ కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఈశ్వరయ్య పాత్ర కూడా బాగుంటుంది. సినిమాలోని పళనియప్పన్, సెబాస్టియన్ ఇలా చాలా పాత్రలు ఆకట్టుకుంటాయి. చిరు అభిమానిగా జోష్ రవి నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలోని పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
విశ్లేషణ:
తెలంగాణ ప్రాంతంలో 80 నుంచి 90 దశకంలో జరిగిన పలు వాస్తవ సంఘటనల ఆధారంగా సిందూరం సినిమాను శ్యామ్ తుమ్మలపల్లి తెరకెక్కించారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు, పోరాట సన్నివేశాలు చాలా సినిమాలో వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్‌తో ప్రేక్షకులను ఆలోచించేలా దర్శకుడు ప్రయత్నించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సిందూరం లాంటి కథను సూటిగా చెప్పడం అంత సులువైన పనేమీ కాదు. నక్సలైట్, ప్రభుత్వం అనే కాన్సెప్టులు, అందులో పోలీస్ వ్యవస్థ మీద ఉండే విమర్శలను చూపించడం అంటే కత్తి మీద సామే. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం అంత సులభం కాదు. కానీ ఇందులో మాత్రం దర్శకుడు ఆ సాహసం చేసినట్టుగా అనిపిస్తుంది. నక్సలైట్ వ్యవస్థలోని లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి చెప్పేశాడు. నక్సల్స్, పోలీసుల మధ్య నలిగిపోయిన ప్రజల జీవితాలు, గ్రామ రాజకీయాల కారణంగా రైతులు వ్యధలను తెరపైన చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించిన తీరును నిజంగా అభినందించాల్సిందే. దర్శకుడు శ్యామ్ ఎంచుకొన్న పాయింట్.. కథగా, సన్నివేశాలుగా విస్తరించిన తీరు బాగుంది. కానీ ఇంకా కొంచెం ఎమోషనల్ టచ్ చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సినిమాను ఎంతో నిజాయితీగా తీసినట్టు కనిపిస్తుంది.
టెక్నికల్:
అప్పటి తెలంగాణ పల్లెలు, అడవి ప్రాంతం చూపించడంలో కేశవ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి సన్నివేశం పచ్చని అడవి తల్లి ఒడిలో సేద తీరినట్టు అనిపిస్తుంది. వాగులు, వంకలు, అడవి ప్రాంతాన్ని బాగా క్యాప్చర్ చేశారు. గౌవ్రా హరి బీజీఎం, పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ కొంచెం ట్రిమ్ చేయాల్సి ఉందనిపిస్తుంది. ఎడిటర్‌గా జస్విన్ ప్రభు తన విధిని సక్రమంగా నిర్వర్తించాడు. శ్రీ లక్ష్మీ నర్సింహా మూవీ మేకర్స్, నిర్మాత ప్రవీణ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకింగ్ పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
దారి తప్పిన నక్సల్స్ ఉద్యమాలు, గ్రామీణ రాజకీయాల్లో ఉండే కుళ్లు, కుతంత్రాలపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం సిందూరం. కంటెంట్, కాన్సెప్ట్ బలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు పుష్కలంగా ఉన్నాయి. సామాజిక సందేశంతో వచ్చిన ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా.
రేటింగ్ 3.25 / 5
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews