శ్రీ సాయి లక్కీ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శ్రీరంగపురం” చిందనూరు విజయలక్ష్మి సర్పణలో చిందనూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎస్. వాసు దర్శకుడు.
వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్ర ట్రైలర్ ను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ దర్శకుడు సముద్ర. వి చేతుల మీదుగా విడుదలగావించారు. అనంతరం సముద్ర మాట్లాడుతూ..
ఈ చిత్ర దర్శకుడు వాసు మేన కోడలు- మేనమామ మధ్య సాగే కథాంశం అని చెప్పారు.. మంచి కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నారు.. నిర్మాత నాగరాజు గారికి బాగా నచ్చిన స్టోరీ అని విన్నాను.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా తీశారని తెలుస్తోంది. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. శ్రీరంగపురం టైటిల్ లోనే సక్సెస్ కనపడుతోంది.. దర్శకుడు వాసు నాకు స్నేహితుడు తనకు మంచి టాలెంట్ ఉంది. హీరో వినాయక్ దేశాయ్ మా వి. వి వినాయక్ అంత మంచి ఫేమస్ అవ్వాలని, నిర్మాతకు ఈ సినిమా ద్వారా మంచి పేరు, డబ్బు రావాలని ఆసిస్తూ అందరికీ నా బెస్ట్ విషెస్ అన్నారు.

అతిథి లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ… టైటిల్ బాగుంది కనెక్ట్ అయ్యేలా ఉంది. పేరన్నది చాలా చేంజెస్ తెస్తుంది.. నేను కూడా పేరు మార్చుకున్న తరువాత ఇండస్ట్రీలో వెనుతిరిగి చూసుకులేదు.. అలానే ఈ చిత్ర దర్శకుడు కూడా శ్రీను పేరు ను వాసుగా మార్చుకున్నాడు గొప్ప స్థాయికి వస్తాడని భావిస్తున్నా.. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ స్వర సుందరం ను నేనె ఇంట్రడ్యూస్ చేశా.. మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తున్నా.. ఇండస్ట్రీ జీరో ను హీరో చేస్తుంది.. అలానే హీరో ను జీరో చేసేస్తోంది కాబట్టి నిర్మాత మంచి మంచి సినిమాలతో ప్రేక్షకాదరణ పొంది గొప్ప నిర్మాతగా నటుడిగా నిలిచిపోవాలి. అలానే ఈ చిత్ర విడుదలకు కావాల్సిన నా వంతు సహాయసహకారాలు అందిస్తానని అన్నారు.

ఈ చిత్ర హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. నేను బాంబే నుంచి వచ్చాను అక్కడ చాలా ప్రయత్నాలు చేసాను కానీ కుదరలేదు.. అందుకే హైదరాబాద్ వచ్చి చాలా ఆడిషన్స్ ఇచ్చిన తరువాత ఈ చిత్రంలో అవకాశం వచ్చింది.. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అందుకే కష్టపడి తెలుగు నేర్చుకొని మరీ ఇక్కడే ప్రయత్నాలు చేస్తున్నా.. ఇక చిత్ర విషయానికి వస్తే.. అప్పట్లో ‘గోరింటాకు’ చిత్రానికి ఆదరణ
కలిగిందో అందరికీ తెలిసిందే అదే తరహాలో బెస్ట్ సెంటిమెంట్ చిత్రంగా నిలిచిపోతుంది. పాటలు అయితే ఇప్పటికే యూట్యూబ్ లలో హల్ చేస్తున్నాయి.. తెలిపారు.

దర్శకుడు వాసు ఎం ఎస్ మాట్లాడుతూ… మేన కోడలు- మేన మామ బంధం అనేది ఎంత గొప్పదో, ఎంత బాద్యతో కూడినదో తెలియచెప్పే చిత్రం శ్రీరంగపురం. నిర్మాత నాగరాజు గారికి బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది. బడ్జెట్ కు వెనకాడకుండా నిర్మించారు ఆయన. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర కూడా పోషించడం జరిగింది. ఈ శ్రీరంగపురం కాన్సెప్ట్ నిర్మాత ఊరిలోనుంచి ఆయన మనసులో నుంచి పుట్టిందే అందుకే షూటింగ్ కూడా శ్రీరంగపురం, బెలగుప్ప, అనంతపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నాము. ఈ రోజు సముద్ర గారు, లయన్ సాయి వెంకట్ గారు మా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేయడం మాకెంతో ఆందకరం అని తెలిపారు.

ఇక చిత్ర నిర్మాత చిందనూరు నాగరాజు మాట్లాడుతూ… మేనమామ- మేనకోడలు బంధం గురుంచి ఇటీవల కాలంలో ఎవరికీ సరిగా తెలియదు.. ఆ బంధం ఎంత పవిత్రంగా ఉంటుందో.. మేన కోడలి పట్ల మేన మామ ఎంతటి బాధ్యతగా ఉంటాడో ఆ మేనకోడలు కోసం మేన మామ తన ప్రాణాలు సైతం వదులుతాడు.. అలాంటి గొప్ప బంధం గురుంచి ఈ చిత్రం ద్వారా తెలియచేయాలన్నదే మా ఉద్దేశ్యం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సైతం మాకు ఎంతో సహకారాన్ని అందించారు వారందరికీ నా ఈ మూలంగా కృతఙ్ఞతలు అని తెలియచేసారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ స్వర సుందర్, కొరియోగ్రాఫర్ మహేష్ రాజ బొమన, త్రిలోక్ నాథ్, ఆంజనేయులు, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్, చిందనూరు నాగరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి డి ఒపి: డి యాదగిరి, ఎడిటర్: మహేష్ మేకల, మ్యూజిక్: స్వర సుందరం, డాన్స్: మహేష్ రాజ బోమన, ఫైట్స్: మల్లేష్, నిర్మాత: చిందనూరు నాగరాజు, దర్శకత్వం: వాసు ఎమ్ ఎస్.

By admin