శ్రీహరికోట: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3 ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ 2 నుంచి MLV3 M4 రాకెట్ చంద్రయాన్ 3ని ప్ర‌యోగించారు. నిమిషానికి 250 కిలోమీటర్ల వేగంతో.. అంతరిక్షంలోకి దూసుకెళ్లింది చంద్రయాన్ 3 రాకెట్. చంద్రయాన్ 3ని తీసుకువెళ్లే రాకెట్ బరువు 642 టన్నులు ఉండగా, చంద్రయాన్ 3 బరువు 3 వేల 900 కిలోలు ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 613 కోట్లు ఖర్చు చేస్తుంది. 6 లక్షల టన్నుల బరువైన రాకెట్ ద్వారా.. చంద్రుడిపై దిగే విక్రమ్ ల్యాండర్ అంతరిక్షంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. 13 నిమిషాల వ్యవధిలోని ఇది కక్ష్యలోకి వెళ్లటం తొలి విజయం అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ ను తీసుకెళ్లిన రాకెట్.. 4 లక్షల కిలోమీటర్లు జర్నీ చేసి.. కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడిపై దిగే విక్రమ్ ల్యాండర్ 40 రోజులపాటు ప్రయాణించి.. చందమామపై దిగనుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై దిగనుంది ల్యాండర్.

23 రోజులు భూకక్ష్యలోని తిరుగుతూ తిరుగుతూ.. చంద్రుడి వైపు అడుగులు వేస్తుంది విక్రమ్ ల్యాండర్.
నాలుగో దేశంగా భారత్ చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ మాత్రమే విజయవంతంగా రోవర్లను దింపాయి. చంద్రయాన్‌-3 విజయవంతం అయితే నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా, రష్యా, చైనాలు మూన్‌ మిషన్‌ కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు ఐదారు వందల కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టింది.

40 రోజుల తర్వాత
40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. అత్యంత సమీపంగా 170 కిలోమీటర్లు, అత్యంత దూరంగా 36 వేల 500 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అప్పుడు భూ కక్ష్యను వదిలి చంద్రుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరుకొనేందుకు 40 రోజులు పడుతుంది. దీనికి అతి తక్కువ ఇంధనమే అవసరం పడుతుంది. దీంతో ప్రయోగం ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.

By admin