చికాగో (న్యూస్ నెట్‌వ‌ర్క్): ఎంత‌టి మ‌హ‌రాణివే.. అంటూ బ‌తుక‌మ్మను ఖండాంత‌రాల్లో ఘ‌నంగా ఆడిపాడుకున్నారు తెలుగు ఎన్నారైలు. అమెరికాలోని చికాగోలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ USA – చికాగో ఇల్లినాయిస్ చాప్ట‌ర్ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నేపర్‌విల్లే ఇల్లినాయిస్ (రాష్ట్రం)లోని మాల్ ఆఫ్ ఇండియాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 450 మందికి పైగా పాల్గొని ఆడిపాడారు. 4 గంటల పాటు నాన్‌స్టాప్‌గా బతుకమ్మ ఆడారు.

బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నం అనంత‌రం తెలంగాణ రుచుల‌తో క‌మ్మ‌ని భోజ‌నాన్ని ఆస్వాదించారు. ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని TDF చికాగో సభ్యుల సహాయంతో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ USA ట్రస్టీ బోర్డు ప్రీతి రెడ్డి నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారికి అలాగే కార్యక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ప్రీతి రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 

 

By admin