సికింద్రాబాద్: సమస్త ప్రాణకోటికి జలమే జీవనాధారమన్నారు ప్రముఖ పాలసీ ఎనలిస్ట్ దొంతి నర్సింహారెడ్డి. అలాంటి జనవనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(TDF) ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ సమీపంలోని సేలింగ్ క్లబ్ అనెక్స్ నిర్వహించిన ‘‘తెలంగాణ నీటి వనరులు – నేటి పరిస్థితి, భవిష్యత్ సమస్యలు’’ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

టీడీఎఫ్ ఇండియా చైర్మన్ మట్టా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న నగర జనాభా, నీటి వనరులు, సరఫరా, సాంకేతిక సమస్యలపై అవగాహన అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరం చుట్టు ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సన్నగిల్లడం, ఎస్టీపీలు తగినన్ని లేకపోవడం, ప్రజలకు ఇంకుడు గుంతలపై అవగాహన లేకపోవడం, వర్షపు నీరంతా వృథాగా పోవడం మురుగునీటిని శుభ్రపరిచి తిరిగి వినియోగంలోకి తేకపోవడం వల్ల రోజురోజుకూ నీటి కొరత ఏర్పడుతుందన్నారు. అంతేకాదు.. సుందరీకరణ పేరుతో ప్రభుత్వాలు జలాశయాల చుట్టూ కాంక్రీట్ కట్టడాలు కట్టడం, పెరుగుతున్న నగర జనభా, నీటి వినియోగంపై ప్రజలను చైతన్యం చేయకపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని నీటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుందని దొంతి నర్సింహారెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాలు ఇకనైనా జల సమస్యల నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. అనంతరం..సదస్సుకు విచ్చేసిన వారి ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను దొంతి నర్సింహరెడ్డితో పాటు సభికులందరూ కొనియాడారు.

ప్రతి సంవత్సరం ప్రపంచ జల దినోత్సవం నీ ప్రభుత్యం అదికరింగ జరపాలని రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమేష్ రెడ్డి, మరకంటి భవాని, ఎం.వి.గోనారెడ్డి, టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ వినిల్, టీడీఎఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పాటి నరేందర్, అనుపమ, అంజన, డి.పి.రెడ్డి, రణధీర్ బద్దం, గిరిధర్, పి.శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

By admin