నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.
“ది ఇండియన్ స్టోరి” అనే సినిమా వస్తుందనగానే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇండియన్ స్టోరి సినిమా తాజాగా థియేటర్స్ లోకి విడుదలైంది. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ హీరోగా నటించారు. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి రూపొందించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? “ది ఇండియన్ స్టోరి” అని టైటిల్ పెట్టడానికి కారణమేంటీ? సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
కథ:
హిందూ వర్గానికి నాయకుడు శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గ లీడర్ కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). ఈ ఇద్దరు నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకుంటుంటారు. విశాఖ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు హెల్ప్ చేస్తాడు. సాయం చేస్తానంటూ స్నేహితుడే మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్ ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ బలవంతం మీద అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. ఆప్తుడిగా మారిన రెహమాన్ ను కబీర్ ఖాన్ హత్య చేయాలని అనుకుంటాడు. ఇందుకు కారణం ఏంటి? జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు? అతను కబీర్ ఖాన్ వర్గంలోకి ఎందుకు చేరాడు? కబీర్ ఖాన్ కూతురిలా చూసుకునే ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? లేదా? మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు నాయకుల ప్లాష్ బ్యాక్ ఏంటి? కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
కొత్తగా హీరో అయిన వారు తాము స్టార్ అనుకుంటారు. అలాగే కమర్షియల్ గా పాటలు, పెద్ద పెద్ద ఫైట్స్ క్రియేట్ చేసుకుంటారు కానీ ఈ సినిమాలో హీరో రాజ్ భీమ్ రెడ్డి కథకు, తన పాత్రకు ఎంత కావాలో అంతే నటించాడు. ఎక్కువ హంగులకు పోలేదు. రాజ్ భీమ్ రెడ్డి ఫైట్స్ సినిమాకే హైలైట్. యాక్షన్ సీక్వెన్సులను బాగా తెరకెక్కించారు. ఫేకుగా చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ బాగుంది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ గా “ది ఇండియన్ స్టోరి” సినిమా ఆకట్టుకుంది.
టెక్నికల్ విభాగం:
సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాల్సినవి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.
విశ్లేషణ:
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదని సమాజానికి మెసెజ్ చెప్పేలా ఉండాలని ప్రూవ్ చేసిన మూవీ ఇది. తమ స్వార్థ రాజకీయాల కోసం మతం రంగు పులుముకుని, మతవిద్వేషాలను రెచ్చగొడుతూ నాయకులు ఎదుగుతున్న వారి బండారాన్ని బట్టబయలు చేసిన చిత్రమిది. పొలిటికల్ లీడర్లు తమ స్వార్థంతో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతుంటారు.. వారి ఉచ్చులో చిక్కకండి అంటూ సుతిమెత్తగా హెచ్చరించిన చిత్రమిది. కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది. రెహమాన్ (హీరో రాజ్ భీమ్ రెడ్డి) వైజాగ్ నుంచి రావడం, అతను ఫ్రెండ్ ఫేకు (చమ్మక్ చంద్ర)ను కలవడం, వాళ్లిద్దరు బంగారు బిస్కెట్లను అమ్మేందుకు పడే పాట్లతో సరదాగా సినిమా టేకాఫ్ అవుతుంది. కబీర్ ఖాన్ ను హత్య నుంచి రెహమాన్ కాపాడటంతో సినిమాలో సీరియస్ నెస్ మొదలవుతుంది.
ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్వించాయి. హీరో హీరోయిన్స్ మధ్య కూడా ఒక చిన్న ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. జర్నలిస్ట్ గా ఉన్న రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాన్ని డైరెక్టర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను ఈ సినిమాలో చూపించారు నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు. మతం పేరుతో మనను విడదీస్తున్న వారి కుట్రలను గమనించాంటూ మంచి సందేశాన్నిచ్చిందీ సినిమా.
రేటింగ్ 3/5
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r