తెలుగు తెర‌పైకి సంచ‌ల‌నాత్మ‌క చిత్రం రాబోతోంది. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ జంట‌గా నటించిన సినిమా “ది ఇండియన్ స్టోరి”. చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, అనంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే మెసెజ్‌తో కమర్షియల్ హంగుల‌న్నీ ఉండేల‌ ఈ సినిమాను రూపొందించాడు డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి. మే 3న‌ ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు మెమొంటోలు అందజేశారు.

ఈ వేడుక‌లో డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… అన్ని మతాలూ సమానమే. మనుషులంతా ఒక్కటే అనే మంచి కాన్సెప్ట్ తో ది ఇండియన్ స్టోరి సినిమాను రూపొందించాం. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థంతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ విషయాన్ని మా మూవీలో చర్చించాం. దీంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా టీమ్ కు హెచ్చరికలు చేశారు. మాపై కేసులు పెట్టారు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అయినా మేము భయపడకుండా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమాలో సందేశం ఉన్నా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, లవ్, డ్రామా, ఎమోషన్ వంటి అంశాలతో ది ఇండియన్ స్టోరి సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.

నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ… ది ఇండియన్ స్టోరి సినిమా మేము నిర్మించడం వెనక ఎలాంటి రాజకీయాలు లేవు. ఒక మంచి సందేశాత్మక సినిమా కమర్షియల్ అంశాలతో రూపొందించే ప్రయత్నం చేశాం. సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నా విజ్ఞప్తి ఒక్కటే ఏ భాషలో అయినా స్థానిక భాష తెలిసిన సెన్సార్ ఆఫీసర్ ఉండాలి. తెలుగు సినిమాల సెన్సార్ కు తెలుగు తెలిసిన అధికారులే ఉండాలి. అప్పుడే మన సినిమాల్లోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ది ఇండియన్ స్టోరి సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా మీరు అనుకున్నట్లు సీరియస్ సబ్జెక్ట్ తో ఉండదు. కామెడీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉంటాయి. చమ్మక్ చంద్రతో నా సీన్స్ హిలేరియస్ గా వచ్చాయి. మీ మొదటి సినిమాను ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ తో ఎందుకు చేశారని చాలా మంది అడుగుతున్నారు. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా మేము సమాజానికి ఏ నెగిటివ్ మెసేజ్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కథను నడిపాం. సెన్సార్ వాళ్లకు కూడా సబబే అనిపించేలా మూవీ ఉంటుంది. ఎడిటర్ జేపి గారు, డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్ ప్యాషన్ తో పనిచేశారు. వన్ మీడియా పార్థు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంతోషంగానే ఉన్నాం. అలాగే సినిమాను రేపు థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజైన బాక్సాఫీస్ విన్నర్ ది ఇండియన్ స్టోరి అవుతుందని నమ్మకంగా చెప్పగలం. నా నెక్ట్ మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. యానిమల్, కేజీఎఫ్ కలిస్తే ఎలా ఉంటుందో అంత యాక్షన్ ఉంటుంది. ఆ సినిమాకు లూథర్ అనే టైటిల్ పెట్టాం. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు.

హీరోయిన్ జరా ఖాన్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను ముంబై నుంచి వచ్చాను. ది ఇండియన్ స్టోరి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాను. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ముంబైలో తెలుగు డబ్బింగ్ సినిమాలో చాలా వస్తుంటాయి. అవి చూశాక ఇక్కడి ఇండస్ట్రీ ఎంత పెద్ద పరిశ్రమో అర్థమైంది. ది ఇండియన్ స్టోరీ సినిమా చూడండి. మంచి కాన్సెప్ట్, మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్నాయి. అన్నారు.

సహ నిర్మాత కమల్ హాసన్ పాత్రుని మాట్లాడుతూ… ది ఇండియన్ స్టోరి సినిమాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. టీమ్ వర్క్ గా కష్టపడిన మా యూనిట్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను ఇక్కడి దాకా తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా హ్యాపీగానే ఫేస్ చేశాం. ది ఇండియన్ స్టోరి సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.

ఎడిటర్ జేపి మాట్లాడుతూ… మా మూవీ ట్రైలర్ మీకు నచ్చినట్లే..సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూశాక మీలో ఒక మంచి ఆలోచన మొదలవుతుంది. మతం పేరుతో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుంటారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది. అన్నారు.

వన్ మీడియా పార్థు మాట్లాడుతూ… ది ఇండియన్ స్టోరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నా ఆధ్వర్యంలోనే జరిగింది. సినిమాకు వర్క్ చేస్తున్న క్రమంలోనే ఓ మంచి సినిమాలో భాగమయ్యానని హ్యాపీగా అనిపించింది. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి, నిర్మాత హీరో రాజ్ భీమ్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేశారు. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, ఆర్ట్ డైరెక్టర్ – మోహన్, వై నాగు, కొరియోగ్రాఫర్ – ఆనంద్ రాజ్ చిగిరి, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, పీఆర్ఓ – కె. శ్రీధర్ (స్టూడియో వన్), బ్యానర్ – ది భీమ్ రెడ్డి క్రియేషన్స్, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin