హైదరాబాద్: ఉద్యమాల పొద్దుపొడుపు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో ఆయనకు నివాళులు అర్పించారు. బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను, స్ఫూర్తినీ, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
గీతా పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం చివరి వరకు పోరాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీరాను ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కాలంగా పోరాడారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా పాలసీనీ ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో నీరా పాలసీ ప్రవేశ పెట్టడంలో కామ్రేడ్ ధర్మబిక్షం స్ఫూర్తి ఉందన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా కామ్రేడ్ ధర్మబిక్షం సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, మంత్రి అంతరంగిక కార్యదర్శి కన్నం సత్యనారాయణ, తెలంగాణ మ్యూజికల్ అసోషియేషన్ అధ్యక్షుడు బల్లెపల్లి మోహన్, జర్నలిస్టు స్వామి ముద్దం తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews