కేసీఆర్ బ‌ర్త్‌డేతో పాటు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సర్వమత ప్రార్థనలు

‘దేశ్ కా నేతా’ మన కేసీఆర్.. అంటూ నినదించిన ఎన్నారైలు

లండన్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు దేశ‌విదేశాల్లో ఘ‌నంగా జ‌రిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆద్వర్యంలో లండన్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి దాదాపు 150 కు పైగా ఎన్నారై భారస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అన్ని మతాల దేవుళ్ళు ఆశీర్వదించాలని ముందుగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థన నిర్వహించారు. వారంతా పూజలు, ప్రార్థనలు చేసి కెసిఆర్ గారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని, రాష్ట్రాన్నే కాదు రాబోయే రోజుల్లో దేశాన్నే నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించి ఆశీర్వచనం అందించారు. హాజరైన అతిథులంతా కూడా ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం టెలిఫోన్ కాల్ ద్వారా ఎన్నారై బీఆర్ఎస్ స‌భ్యుల‌తో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని, సందర్భం ఏదైనా వారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజాన్ని అనిల్ కూర్మాచలం గారు కోరారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడే మన పాలకుడై నేడు సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు మనకు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుతున్న సంక్షేమ పథకాల్ని నేడు దేశమంతా అనుసరిస్తుందని, ఇక రాబోయే రోజుల్లో మన కెసిఆర్ గారు దేశానికి నాయకత్వం వహించాలని దేశం ఎదురుచూస్తుందని, ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి నిర్ణయం ఏదైనా వారి వెంటే ఉంటామని అశోక్ అన్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా లండన్ లో కెసిఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, నాడు లండన్ లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, మాకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ప్రపంచవ్యాప్త ఎన్నారై బీఆర్ఎస్ ప్రతినిధులకు అశోక్ కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ సర్వమత ప్రార్థనలు చేసి కేసీఆర్ ని ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపి, తామంతా కేవలం వేడుకలకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రామాలు కూడా నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అబుజాఫర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కెసిఆర్ బాగుండాలని అల్లాని ప్రార్థించానని, అన్ని మతాల ప్రజల ఆశీస్సులు కెసిఆర్ కి ఉన్నాయని, నేడు కెసిఆర్ గారి వల్లే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉన్నారని అబుజాఫర్ తెలిపారు.

అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ సీఈక చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖండాంతరాల్లో ఉంటూ బీఆర్ఎస్ జెండా మోసే అవకాశం కలిపించిన కేసీఆర్ గారికి అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, హరీష్ రావుకి, కవితకి, ఇతర నాయకులందరికీ చంద్రశేఖర్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నారై బీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా కేక్ కట్ చేసి కెసిఆర్ 69 వ జన్మదిన వేడుకల్ని జరుపుకొని, హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ , దేశ్ కా నేతా కెసిఆర్ , అభ్కి భార్ కిసాన్ కి సర్కార్.. మేమంతా మీ వెంటే అంటూ నినదించారు. ప్రవాసులంతా కేసీఆర్ జన్మదిన విందు భోజనాన్ని ఆనందించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శి హరి గౌడ్ నవాబుపేట్, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధి రవిప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు మల్లా రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, గణేష్ పస్తం, సతీష్ రెడ్డి బండా, గణేష్ కుప్పలా, ప్రశాంత్ మామిడాల, సురేష్ బుడగం, ప్రవాస సంఘాల నాయకులు శుష్మునా రెడ్డి, స్వాతి బుడగం, ప్రవళిక భువనగిరి, స్నేహ, నంతిని తదితరులు పాల్గొన్నారు.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin