(స్వాతి – న్యూజెర్సీ):

న్యూజెర్సీ: హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన పండ‌గ వైకుంఠ ఏకాదశి అమెరికాలో ఒక రోజు ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం ఈ పండుగ‌ను తెలుగు ఎన్నారైలు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. హిందూ ఆధ్యాత్మిక ప్ర‌వ‌హాన్ని కొన‌సాగిస్తున్న న్యూజెర్సీలోని సాయిద‌త్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాల‌యం ఇందుకు వేదికైంది. ఉద‌యం నుంచే ఎన్నారై భ‌క్తులు హ‌రినామాన్ని స్మ‌రించుకుంటూ ఉత్త‌ర ద్వారం నుంచి ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం తూర్పు ద్వారం నుంచి బ‌య‌ట‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జ‌పాలు, హోమాలు, జాగ‌ర‌ణ‌, అభిషేకాలు.. వంటి పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

ఈ సంద‌ర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్య‌త‌ను సాయిదత్త పీఠం నిర్వాహకులు శ్రీ రఘుశర్మ శంకరమంచి భ‌క్తులకు వివ‌రించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం, శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయ‌న తెలిపారు. భార‌త్‌లో శ‌నివారం వైకుంఠ ఏకాదశి జ‌రుగుతున్న రోజు కూడా సాయిద‌త్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

 

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin