హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లో ఒక ఆకారం హ‌ల్‌చ‌ల్ చేసింది. గ్రహం మాదిరిగా ఉన్న ఓ ఆకారం దర్శనమిచ్చింది. కొంద‌రు తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. ఇంకేం వైర‌ల్ చేశారు. ఈ ఆకారంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్‌ వాసులు తెలుపు రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి క‌న్ఫ్యూజ్ అయ్యారు. అది గ్రహమా? లేక ఏదైనా నక్షత్రమా? అని సందేహాలు వ్యక్తం చేశారు. లేదంటే ఏలియన్ షిప్ ఏమైనా మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తోందా? అంటూ దానిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే కొందరు మాత్రం ఇది మార్స్ గ్రహం అని అంటున్నారు. ఇలా కొందరు గ్రహం అని, మరికొందరు స్టార్ అని, ఇంకొందరు ఏలియన్ అని రకరకాల ఊహాగాలనాలతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

శాస్త్రవేత్తల క్లారిటీ
ఇది ఓ గ్రహం అని, న‌క్ష‌త్రం అని, ఏలియన్స్ అని జరుగుతున్న ప్రచారానికి తెరదించారు శాస్త్రవేత్తలు. అది వెదర్ రీసెర్చ్ బెలూన్ అంటూ తేల్చేశారు శాస్త్రవేత్తలు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన హీలియం బెలూన్ అని స్ప‌ష్ట‌త ఇచ్చారు సైంటిస్టులు. వెయ్యి కేజీల బరువు ఉన్న హీలియం బెలూన్ అని తెలిపారు. దీనిపై వస్తున్న ప్ర‌చారాన్ని కొట్టిపారేశారు.

By admin