రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం విరాటపర్వం (Virataparvam). వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా వెన్నెల రెండు సార్లు జన్మించింది.. అంటూ ఉత్కంఠను క్రియేట్ చేసింది చిత్రయూనిట్. వెన్నెల రెండు సార్లు జన్మించింది.. వివరాలు రేపు ఉదయం 11:07 AM #SoulOfVennela from అంటూ సస్పెన్స్‌లో పెట్టారు.
ఇక ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది. సినిమా థియేటర్‌లో విడుదల కానుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు బ్రేక్స్ పడ్డాయి. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నారు. మరో నటి ప్రియమణి భరతక్క అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ విషయంలో కూడా ఇబ్బుందలు ఏర్పడ్డాయని ఆ మధ్య టాక్ నడిచిన విషయం తెలిసిందే.
ఇక విరాటపర్వం (Viraataparvam) సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో(Rana Daggubati) రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విరాటపర్వం (Viraataparvam) సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారట దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.
The #SoulOfVennela from #VirataParvam out Tomorrow at 11:07 AM
#VirataParvamOnJuly1st
@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl