అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నూతన అధ్యక్షుడు జయంత్ చల్లాకు వాషింగ్టన్ లో ఘన స్వాగతం లభించింది. వర్జీనియాకు చెందిన పలువురు ‘ఆటా’ సభ్యులు వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయంలో జయంత్ చల్లాకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జయంత్ చల్లా స‌తిమ‌ణి క‌విత చ‌ల్లా (టీడీఎఫ్ పూర్వ అధ్య‌క్షురాలు), రవి చల్లా, రవి పల్లా, ముత్యం పెంటల, లత పెంటల, నితిన్ కల్లెం, ప్రియ దర్శిని, భరత్, లికిత్, ఆర్య, ఆకర్ష్, భావన, రుజులా.. తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూత‌న అధ్యక్షుడిగా చల్లా జయంత్ బాధ్యతలు స్వీక‌రించారు. లాస్‌వేగాస్‌లో శ‌నివారం జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షురాలు మధు బొమ్మినేని నూత‌న అధ్య‌క్షుడికి బాధ్యతలు అప్ప‌గించారు. 2025-27 కాలానికి ఆయ‌న ఆటా అధ్య‌క్షునిగా కొన‌సాగుతారు. ఈ స‌మావేశంలో యూఎస్‌లోని ఆటా డైరెక్ట‌ర్‌లు, స‌ల‌హాదారులు, మాజీ అధ్య‌క్షులు, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు, ఇత‌ర ప్ర‌తినిధులు పాల్గొన్నారు.