హైద‌రాబాద్ (MEDIA BOSS NETWORK):
హైద‌రాబాద్ చుట్ట‌ప‌క్క‌ల ఉన్న‌ జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యించింది. స‌చివాల‌యంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం మంత్రి హ‌రీశ్‌రావు మంత్రివ‌ర్గ నిర్ణ‌యాల‌ను మీడియాకు తెలిపారు. G.O 111ను పూర్తిగా ఎత్తివేస్తున్న‌ట్లు హ‌రీశ్‌ ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యంతో హైదరాబాద్ కు చేరువలో ఉన్నా భూములను వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క‌లాపాల‌కు వినియోగించుకునేందుకు అనుమ‌తిలేక ఇబ్బందిప‌డుతున్న‌ ఆయా గ్రామాల ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో సంతోషం నింపింది. తెలంగాణ ప్ర‌భుత్వం 111 G.O పూర్తిగా ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో ఈ జీవో పూర్వ‌ప‌రాల‌ను తెలుసుకుందాం.

ఈ G.Oను ఎత్తివేయ‌డం వ‌ల్ల ఎవ‌రికీ లాభం?
హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. చాలా ఏండ్ల‌ వ‌ర‌కు ఈ జలాశయాలే హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాలు తీర్చాయి. కాగా, ఈ జ‌లాశ‌యాల‌ను క‌లుషితం, క‌బ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్ప‌టి స‌ర్కారు G.O 111 తీసుకొచ్చింది. ఈ G.O కార‌ణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం క‌లుగుతున్న‌ది.

ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్‌పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 G.O ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 G.O పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 G.Oను రద్దు చేయాలని నిర్ణయించింది.

అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ 2 జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా తాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని CM KCR అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వ‌దిలేందుకు తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

G.O 111 ఎత్తేస్తే ఎవ‌రికి లాభం?
జీవో 111 కిందికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప‌రిధిలోని 84 గ్రామాలు వ‌స్తాయి. ఇదంతా బ‌యో క‌న్జ‌ర్వేష‌న్ జోన్‌గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది దాదాపు GHMC విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల భూములున్నాయి. నగరానికి చేరువలో మరో హైద‌రాబాద్ పట్టేంత విస్తీర్ణంలో భూములున్నా అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై G.O 111 ప్ర‌కారం ఆంక్ష‌లున్నాయి. ఇక్క‌డ వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క‌ల‌పాలపై నిషేధం ఉంది.

దీంతో ఇక్క‌డ అభివృద్ధికి అడ్డుక‌ట్ట‌ప‌డింది. ఆయా గ్రామాల ప్ర‌జ‌లు మ‌హాన‌గ‌రానికి ద‌గ్గ‌ర ఉన్నా అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉండిపోయామ‌ని మ‌న‌వేద‌న చెందుతున్నారు. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ G.O 111 పూర్తి ఎత్తివేత‌కు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగ‌నున్నాయి. ఈ గ్రామాలు కూడా హైద‌రాబాద్‌లా అభివృద్ధి బాట‌ప‌ట్ట‌నున్నాయి.

ఈ G.O పరిధిలోకి వచ్చే గ్రామాలు..

అత్యధికంగా శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాల చొప్పున, షాబాద్ మండలంలోని 2 గ్రామాలు, కొత్తూరు మండలంలోని ఒక గ్రామం 111 జీవో పరిధిలోకి వస్తాయి. ఈ జీవోను ఎత్తివేస్తే.. ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతాయి.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php 

 

By admin