గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో హీటెక్కిస్తున్న సీటు ఏదైనా ఉందీ అంటే.. అదీ మేడ్చల్ మాత్రమే. జెట్ స్పీడ్‌లో అభివృద్ధి చెందుతున్న నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ గెలిచేదెవ‌రు అనే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్. ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జెండా ఎగ‌రేసేది ఎవ‌రు? గెలిచే దమ్ము ఎవ‌రికి ఉంది? ఎవ‌రి బ‌లం ఏంటీ? మేడ్చల్‌ పొలిటికల్ పిక్చర్ ఎలా ఉందో ఇవాల్టీ ఆనాలిసిస్‌లో తెలుసుకుందాం.

మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ స‌మ్‌థింగ్ స్పెష‌ల్. హైద‌రాబాద్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. ఇక్కడ గెలిస్తే చాలు.. కీలక పదవులు వరిస్తాయనే సెంటిమెంట్ కూడా ఉంది.

బీఆర్ఎస్‌లో ఇద్ద‌రు


ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముందు నుంచీ.. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. 2009 నుంచి చూసుకుంటే, కె.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత 2018 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దాంతో.. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయ్. అంటే, ఇక్క‌డ ఈ టికెట్ కోసం పోటీప‌డేది ఇద్ద‌రు రెడ్డి నేత‌లే.

బీజేపీలో గంద‌ర‌గోళం


ఈ నియోజ‌క‌వ‌ర్గం సెమీ అర్బన్ ఏరియా కావ‌డంతో బీజేపీ కూడా ఇక్కడ గెలుపు ఆశలు పెట్టుకుంది. మేడ్చల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో.. జిల్లా ప్రెసిడెంట్ పట్లోళ్ల విక్రమ్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన కొంపల్లి మోహన్ రెడ్డి.. రేసులో ఉన్నారు. బీజేపీలోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో.. క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచి కూడా ఇద్ద‌రూ రెడ్డి నేత‌లే టికెట్ కోసం త‌ల‌ప‌డుతున్నారు.

కాంగ్రెస్‌లో స‌రైనోడు


మేడ్చల్‌లో కాంగ్రెస్ బ‌లంగా ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గం.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి రావడం.. దానికి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండటంతో.. ఇక్కడ.. కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఇద్దరు నేతలు ఉన్నారు. మూడు చింతలపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మ‌రో నేత టీ-పీసీసీ ఉపాధ్య‌క్షుడు తోటకూర జంగయ్య యాదవ్ ఆలియ‌స్ వ‌జ్రేష్ యాద‌వ్. టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు.. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ ఇద్ద‌రి బ‌ల‌బ‌లాలు చూసుకుంటే, రేవంత్ రెడ్డికి న‌మ్మిన బంటుగా వ‌జ్రేష్ యాద‌వ్‌కు.. గుర్తింపు ఉంది. అన్నింటికి మించీ వ‌జ్రేష్ యాద‌వ్ బీసీ నేత‌. యాదవ‌ సామాజిక‌వ‌ర్గం వ్య‌క్తి.

నిజానికి ఈ నియోజక‌వ‌ర్గంలో బీసీ ఓటింగ్ అధికం. బీసీల్లో గౌడ్‌, ముదిరాజ్, యాద‌వ్ సామాజిక‌వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇద్ద‌రు రెడ్డిలు, బీజేపీ నుంచి ఇద్ద‌రు రెడ్డిలు, కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో బీసీ వ‌ర్గానికి చెందిన ఒకే ఒక్క‌డు వ‌జ్రేష్ యాద‌వ్. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు ఎక్కువ ఉండ‌టం, బీసీ నినాదం.. వంటి అంశాల నేప‌థ్యంలో ఈ సారి వ‌జ్రేష్ యాద‌వ్‌కు టికెట్ ఇస్తే గెలుపు సులువు అని మేడ్చ‌ల్ సెగ్మెంట్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల వ‌జ్రేష్ యాద‌వ్ దూకుడు పెంచారు. ప్ర‌భుత్వ విధానాల‌పై నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ, నియోజ‌క‌వ‌ర్గంలో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్త‌మ్మీద ఈసారి మేడ్చ‌ల్ టెంపరేచర్ మ‌రింతా హీటెక్క‌నుంది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin