చిత్రం: ‘యాద్గిరి & సన్స్’
విడుదల తేది: మే 5, 2023
నటీనటులు: అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు.
సంగీతం: విజయ్ కురాకుల
డీఓపీ: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పీఆర్వో: బి. వీరబాబు
కో-డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
తెలుగు తెరపైకి మరో విభిన్న కథాచిత్రం వచ్చింది. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి & సన్స్’. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
యాద్గిరి(జీవా)కి లక్ష్మణ్(మోతీలాల్) – వెంకట్(అనిరుధ్) అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. చిన్న కొడుకు వెంకట్ జాబ్ చేస్తుంటాడు. పెద్దొడు లక్ష్మణ్ తన తమ్ముడి డబ్బులు దొంగిలిస్తూ తాగుతుంటాడు. ఒకరోజు వెంకట్ తన ప్రియురాలు స్వాతి(యశస్విని)కి గిఫ్టు కొనడానికి పొదుపు చేసిన డబ్బును లక్ష్మణ్ దొంగిలించి తాగుతుంటాడు. వెంకట్ కోపంతో తన అన్న లక్ష్మణ్‌పై గొడవ పడుతాడు. గొడవలో, అతని అన్న చనిపోతాడు. వెంకట్ కటకటాల వెనక్కి వెళతాడు. బెయిల్ వచ్చిన తర్వాత వెంకట్ తన సోదరుడి బీమా గురించి తెలుసుకుని అవక్కవుతాడు. ఇంతకీ ఆ బీమా ఏంటీ? దాని వెనక ఏం జరుగుతుంది? ఎలాంటి ట్విస్టులు జరుగుతాయనేదే సినిమా కథ.
నటీనటుల ప్రతిభ:
తండ్రి యాద్గిరి పాత్రలో సీనియర్ నటుడు జీవా తన పాత్రకు జీవం పోశాడు. అతని చిన్న కొడుకు వెంకట్ పాత్రలో లీడ్ రోల్ చేశాడు అనిరుధ్. సినిమా కథ మొత్తాన్ని తన మీద వేసుకున్నాడు. తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. అతనికి లవర్‌గా నటించిన యశస్విని క్యూట్‌గా కనిపించింది. అడ్వకేట్ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. తన నటనతో సినిమా కథకు మరింతా వన్నె తెచ్చాడు. విలన్‌గా చేసిన రోహిత్ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇక మిగతా పాత్రల్లో నటించిన మురళీధర్ గౌడ్, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
తను రాసుకున్న కథకు న్యాయం జరిగేలా టెక్నికల్ టీంను సరిగ్గా వాడుకోవడంలో డైరెక్టర్ భిక్షపతి రాజు పందిరి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలో విజయ్ కురాకుల అందించిన మ్యూజిక్ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సినిమాలో పాటలు లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు విజయ్. డీవోపీ అందించిన శ్రీను బొడ్డు పనితనం కూడా సూపర్. ఎడిటింగ్ వర్క్ చేసిన మార్తాండ్. కె. వెంకటేష్ పనితీరు పర్వాలేదు. కాస్త కత్తెరకు పని చెప్పాల్సి ఉండేదని అనిపిస్తుంది.
విశ్లేషణ:
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ భిక్షపతి రాజు. సినిమాల్లో ఇంతవరకు రాని సబ్జెక్టును తీసుకున్నారు. ”ఇలా కూడా జరుగుతుంది జాగ్రత్త..” అంటూ ఓ అలర్ట్‌ను అందించే ఓ మెసెజ్ కూడా ఈ సినిమాలో ఉంది. అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లేటప్పుడు.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఖచ్చితంగా ఈ సినిమా అందిస్తుందని చెప్పవచ్చు.
రేటింగ్ 3.25 / 5
****
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews