కంటెంట్ ఉంటే చాలు స్టార్‌లు ఉన్నారా లేదా అని చూడకుండా అన్నీ రకాల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భారీ యాక్షన్ మూవీస్‌యే కాకుండా.. ఫ్యామిలీ, క్రైం అండ్ కామెడీ సినిమాలనూ చూస్తున్నారు. నచ్చితే చాలు బ్లాక్ బాస్టర్ కూడా చేసేస్తున్నారు. ఇలా చిన్న సినిమాలూ ఊహించని విధంగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లవ్ అండ్ క్రైం కామెడీ ఫిల్మ్ గా ‘పరారి’ చిత్రం రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యోగేశ్వర్, అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి.గిరి నిర్మాణంలో వచ్చిన ‘పరారి’ చిత్రం ఎలా ఉంది? యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుందా?. ఇంతకీ సినిమా కథ ఏంటీ? ఎలా సాగింది? ఈ డౌన్స్ అన్నీ ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.
కథ:
హీరోహీరోయిన్లు యోగి (యోగీశ్వర్), అతిథి(అతిథి) ఇద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుతారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) ఒక బిజినెస్ మేన్. చాలా బిజీ. కొడుకును బాగా చూసుకుంటాడు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ కి తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగీ తండ్రి.. పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) చేత కిడ్నాప్ కి గురవుతాడు. మరి యోగి.. మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్ కి గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? తన కాలేజ్ మీట్ అయిన అతిథితో లవ్ ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనేదే ఈ సినిమా.
నటీనటులు ప్రతిభ:
ఫస్ట్ మూవీతోనే హీరో యోగీశ్వర్ అదుర్స్ అనిపించాడు. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. యూత్‌ను, మాస్ ని మెప్పించే మ్యూజిక్ ఉండటంతో.. హీరో కూడా అందుకు తగ్గట్టుగానే డ్యాన్స్ ఇరగదీసేశాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. హీరోయిన్ అతిథి పాత్ర క్యూట్‌గా అనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా పరవాలేదు. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర కూడా గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. జబర్దస్త్ రఘు కారుమంచి బాగా నవ్వించాడు. తన కామెడీ టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సీనియర్ నటుడు ఆలీ సైలెంట్ గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రనే చేసి మెప్పించాడు. హీరో తండ్రిగా షయాజీ షిండే బాగా నవ్విస్తాడు. అలాగే హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటీ కూడా తెలంగాణ యాసలో గయ్యాళిగా ఆకట్టుకుంటుంది. ఇక బాలీవుడ్ నటుడు థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే అమ్మాయిలను కిడ్నాప్ చేసి వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా తన పాత్ర పరిధి మేరకు నటించారు. స్వామీజీ పాత్రలో కమెడీయిన్ జీవా కాసేపు నవ్వించారు.
విశ్లేషణ:
‘పరారీ’లో దర్శకుడు సాయి శివాజీ ఈ సినిమాకి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి.. ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్ ని ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టించారు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్ తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసిన దర్శకుడు.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ ఇచ్చి.. సెకెండాఫ్ పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. మధ్యలో హీరో, హీరోయిన్, ఐటెం గాల్స్ తో చేయించిన డ్యాన్సులు మంచి ఊపు తెస్తాయి. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగా నవ్విస్తుంది. లవ్, క్రైం, కామెడీ. థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్‌కు ఆసక్తి కలిగిస్తాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్ గా రాసుకుంటే చాలు.. థియేటర్లో రెండున్నర గంటల పాటు ఆడియన్ హాయిగా కూర్చబెట్టవచ్చుని నిరూపించింది ఈ సినిమా.
ఈ సినిమాకు హైలైట్ ఏంటంటే.. డైరెక్టర్ సాయి శివాజీ ఫన్ ఎపిసోడ్ ని బాగా ఎంగేజింగ్ తీశాడు. సినిమా ఆద్యంతం నవ్వించేలా తీర్చిదిద్దాడు. గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్‌గా మారింది. పాటలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీగా తీశారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు మంచి మార్కులు వేయవచ్చు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాని తీశారు నిర్మాత జి.వి.వి.గిరి. మొత్తానికి ఈ సినిమా నవ్విస్తుంది, ఆద్యాంతం థ్రిల్‌కు గురి చేస్తుంది. ఒక మంచి సినిమా మిస్ అవ్వద్దంటే ఏ మాత్రం అలోచించకుండా వెళ్లి చూడాల్సిందే.
రేటింగ్: 3/5
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
…
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews