యువ‌త‌ను ఆక‌ర్షిస్తే సినిమా హిట్ట‌యిన‌ట్టే. అలా యూత్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్న సినిమా రేవ్ పార్టీ. బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో తెర‌కెక్క‌బోతోంది. అన్ని ప‌నులు పూర్తి చేసుకొని ఉగాది సందర్భంగా మార్చి 24 శుక్రవారం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగెశ్వర్ డైరెక్టర్ వంశీ, మేజర్, గుఢాచారి డైరెక్టర్ శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంతో క్రిష్ సిద్దిపల్లి హీరోగా నటిస్తున్నారు. సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ వెంకట్ మన్నం సంగీత దర్శకుడిగా దిలీప్ బండారి ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ అందరిలో ఆసక్తిని రేపుతుంది పోస్టర్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన విజువల్స్ యూత్ ని ఆకర్షించే విధంగా పోస్టర్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాజు బొనగాని మాట్లాడుతూ.. స్ట్రయిట్ కన్నడ ఫిల్మ్ తీస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. కన్నడాలో చిత్రీకరించిన తరువాత ఈ సినిమాను మిగితా భాషాలో పాన్ ఇండియా స్థాయిలో విడుదుల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 3 నుంచి షూటింగ్ ప్రారంభించి శ‌రవేగంగా ఒకే ఒక షెడ్యూల్ లో చిత్రాన్ని తెరకెక్కించాడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. రేవ్ పార్టీ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి హాజరయిన పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్లు వంశీ, శశికిరణ్ టిక్కా తదితరులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అయితే అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది. ఆ పార్టీలో యూత్ ఎలా ప్రవర్తిస్తుంటారు అంటే ఆ పార్టీలో యూత్ వాడే డ్రగ్స్ ఏంటీ, అవి ఎలా తీసుకుంటారు. ఈ రకమైన సంప్రదాయాన్ని పోలిటిషియన్స్ ఎందుకు ప్రొత్సహిస్తున్నారు. దాని వెనుక రాజకీయ నాయకుల అజెండా ఏమిటి అన్న విషయాలు, ఇలాంటి పార్టీల మూలంగా యువత జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి అనే పాయింట్ తో చాలా రియాల్టీగా, ఉత్కంఠభ‌రితంగా.. సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తీర్చిదిద్ద‌బోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఉడిపి, గోవా, మణిపాల్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఈ రకమైన పార్టీలు జరుగుతుంటాయి, అందుకోసం ఈ చిత్రాన్ని ఆ ప్రదేశాలలోనే చీత్రికరించాడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. సినిమా మొదలు పెట్టిన తరువాత ఏకదాటిగ చిత్రీకరణ పూర్తి చేసి ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో బలమైన ప్రచారాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సందర్భంగా దర్శకుడు రాజు బొనగాని మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

రేవ్ పార్టీ సినిమా హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ రాజు బొనాగానికి, చిత్ర నిర్మాతలకు కృజ్ఙతలు తెలిపారు. అలాగే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన శక్తికి మించి క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి తెరపై ఇంకా ఉన్నతంగా కనిపించేలా నటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానికి వచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్లు వంశీ, శశికిరణ్ టిక్కా తదితరులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక చిత్రానికి ఎడిటర్ గా రవి కుమార్ కె, డైలాగ్ రైటర్స్ గా సూర్య-ప్రేమ్ బీఎస్, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ ఆరే, కో డైరెక్టర్ నాగరాజు నాయక్ డీ, పబ్లిసిటీ డిజైనర్ లక్కీ. సహా నిర్మాతలుగా లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, సీతారామరాజు జి ఎస్, నారయాణ స్వామి ఎస్ పనిచేస్తున్నారు. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సినీ ప‌రిశ్ర‌మ నుంచి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin