ఢిల్లీలో ఈనెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్ (చర్చకుడు) గా ఆహ్వానించారు. తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్ డా. ఇ. గంగాధర్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్ నుండి గల్ఫ్ దేశాలకు జరిగే కార్మిక వలసలపై ఈ సదస్సులో చర్చిస్తారు. విదేశీ వ్యవహారాలు, కార్మిక, నైపుణ్య మంత్రిత్వ శాఖల అధికారులు, అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొంటారు