మ‌ల్లాపూర్ (జ‌గిత్యాల ) బ్రేకింగ్‌న్యూస్ నెట్‌వ‌ర్క్:
ఎస్సీల‌లో ఏబీసీడీ వ‌ర్గీక‌ర‌ణ చేస్తూ చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని తెలంగాణ మాస్టిన్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బుద్దుల గంగ‌న‌ర్స‌య్య డిమాండ్ చేశారు. ఎస్సీలకు అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల మాల, మాదిగలే గరిష్ఠంగా లబ్ధి పొందుతున్నాయ‌న్నారు. ఉమ్మడి ఏపీలో నాలుగేండ్లపాటు అమలైన వర్గీకరణ కూడా ఉపకులాలకు న్యాయం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎస్సీ ఉపకులాలను ఆదుకునే విధంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు బిల్లు పెట్టాల్సిన అవసరం ఉన్నద‌ని అన్నారు.

1996 సెప్టెంబ‌ర్‌లో ఆనాటి ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రామ‌చంద్ర‌న్ రాజు క‌మీష‌న్ ఎస్సీల‌లో ఉన్న 5-6 కులాలు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాల‌తో ల‌బ్ది పొందాయ‌ని, మిగిలిన కులాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని క‌మిష‌న్ తేల్చింద‌ని గంగ‌న‌ర్స‌య్య అన్నారు. తెలంగాణ‌లో ఎస్సీల జ‌నాభా 63,60,158 ఉండ‌గా, అందులో మాదిగ‌ల జ‌నాభా 25,09,992. అంటే 39 శాతం అందులో మాదిగ‌ల జ‌నాభా. మాల‌ల జ‌నాభా 17,05,448. అంటే 27 శాతం. మిగిలిన ఉప కులాల సంఖ్య 21,44,718. అంటే ఉప కులాలు 34 శాతం. 15 శాతం రిజ‌ర్వేష‌న్‌ల‌లో మాల‌లు 6 శాతం. మాదిగ‌లు 5 శాతం మిగిలిన‌వి 4 శాతం మిగిలిన 57 ఉప కులాల‌కు. ఉప కులాలో మూడు కులాలు 2 శాతం, మిగిలిన 57 ఉప కులాలో మూడు కులాలు 2 శాతం ల‌బ్ది పొందారు. ఏబీసీడీ వ‌ర్గిక‌ర‌ణ చేస్తూ గ‌తంలో ఉన్న ఉష మేర క‌మీష‌న్ రిపోర్టు, రామ్ చంధ‌ర్ రాజు గారి రిపోర్టు ఆధారంగా 5 శాతం రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ల‌బ్ది పొంద‌ని కులాల‌ను ప్ర‌త్యేక గ్రూపులో చేర్చాల‌ని కేంద్రాన్ని బుద్దుల గంగ‌న‌ర్స‌య్య డిమాండ్ చేశారు.

By admin