నటీనటులు & చిత్రయూనిట్:
అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ (బీ.ఎస్), శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి, సి ఎస్ ఆర్, నర్సింహ రెడ్డి, పద్మ, మానుకోట ప్రసాద్, తాటి గీత, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, కటారి, రజిని, సుష్మా తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాతలు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా కె.చిట్టి బాబు, సంగీతం చరణ్ అర్జున్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ, ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే.
బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. తాజాగా ఈ సినిమా విడుదలై థియేటర్‌లలో సందడి చేస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన, దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతోో, నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
భీమదేవరపల్లి తెలంగాణా రాష్ట్రంలోని ఓ చిన్న పల్లె. అక్కడి జనాలు నిరక్షరాస్యులు. కొద్దిగా చదువుకున్న వారు ఏది చెపితే అదే నిజమని నమ్ముతుంటారు. కేంద్ర ప్రభుత్వం జీరో బాలెన్స్ తో బ్యాంక్ ఖాతాలు తెరవమని చెప్పగానే బ్యాంక్ లో ఖాతాలు తెరిసేస్తారు. అంతేకాదు తమ ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు వేస్తుందనే పుకారును ఇట్టే నమ్మేస్తారు. అందుకు తగినట్లే ఆ ఊరిలోని జంపన్న ఖాతాలో 15 లక్షలు జమ అవుతాయి. అంతే జంపన్న తీరు మారిపోతుంది. ఫోజులకు కొడుతుంటాడు. ఇక జంపన్న ఖాతాలో పడ్డట్లే తమ ఖాతాల్లోనూ లక్షలకు లక్షలు వచ్చిపడతాయనే వెర్రినమ్మకం కలిగించిన గిరికి 50 వేల లంచం ఇచ్చేస్తారు. అవి ప్రభుత్వం సొమ్ము కాదని, బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటు అని బయటపడుతుంది. అప్పటికే ఆ డబ్బును తీసి ఖర్చు పెట్టేస్తాడు జంపన్న. ఆ తర్వాత జంపన్నకు ఎదురైన పరిస్థితి ఏమిటీ? 15 లక్షలు వస్తాయన్న ఆశతో మధ్యవర్తికి సొమ్ములు ఇచ్చిన మిగిలిన వారి పరిస్థితి ఏమిటీ? అన్నదే ఈ చిత్రం.
విశ్లేషణ:
ఉచితంగా డబ్బు దొరికితే మనుషుల మనస్తత్వం ఎలా మారుతుందన్నది ఈ చిత్రంలో జంపన్న పాత్రద్వారా చూపించారు. మోసకారి అని తెలిసి నమ్మి డబ్బులు ఇచ్చే ప్రజలు ఎంత అమాయకులో కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. పల్లెలలో మధ్య, దిగువ తరగతి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందనే దానిని తెర మీద బాగా ఆవిష్కరించారు. అంతేకాదు ఇందులో ప్రతి పాత్ర తెలంగాణ యాసను చక్కగా పలకటం కథకు అదనపు ఆకర్షణ అయింది. చరణ్ అర్జున్ బాణీలతో రూపొందిన పాటలు కూడా కథానుగుణంగా సాగాయి. సినిమా తొలి భాగం ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌గా కొనసాగి సెకండాఫ్ వచ్చే సరికి ఆ టెంపో కాస్త తగ్గినట్టనిపిస్తుంది. సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయ నేత అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ పై పెట్టిన టీవీ డిబేట్ కాస్త బోర్ కొట్టేసింది. ప్రధాన పాత్రలు పోషించిన సాయి ప్రసన్న, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, రాజవ్వ, కీర్తిలత, అభిరామ్, రూప శ్రీనివాస్, రాజశేఖర్ అన్నంగి, గడ్డం నవీన్ నటనలో సహజత్వం కనిపించింది. చిన్న పాయింట్ కు ఎంటర్ టైన్ మెంట్ జోడించి, మెసేజ్ అందిచాలని తాపత్రయడ్డాడు దర్శక రచయిత రమేశ్ చెప్పాల. అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
భీమదేవరపల్లి బ్రాంచి ఒక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను నియో రియలిజం జానర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ అండ్ ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా తెరకెక్కించబడిన కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది.
రొటీన్ సినిమాలకు భిన్నమైన కథనం ఎంచుకున్న నిర్మాతలు బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లికి ఫుల్ మార్కులు వేయవచ్చు. ఈ తరహా సినిమాలను రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రీబ్యూటర్స్‌ను కూడా మెచ్చుకోవలసిందే.
ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన ‘బలగం’ కూడా ఒక ఉదాహరణ. ఈ తెలంగాణ నేపథ్య ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కళ్లకు నచ్చుతుంది. మన మనసును తాకుతుంది.
– స్వామి ముద్దం
రేటింగ్: 3.75 / 5
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews