తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వనిత చేయూత ప్రాజెక్ట్ లో భాగంగా తూప్రాన్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సిరెడ్డి చేతుల మీద ప్రారంభించారు. టైలరింగ్ క్యాంపు సభ్యులకి టీడీఎఫ్ – యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ వారి సహకారంతో తెలంగాణ అగ్రికల్చర్, వెల్ఫేర్ కమిషన్ నెంబర్ మార్కంటి భవాని చేతుల మీద మహిళలకు ఉచిత టైలరింగ్ కిట్స్ అందించారు.
తెలంగాణ ప్రాంతంలో మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడానికి, సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు వారికి చేయుతనిచ్చే ఉద్దేశంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సెట్విన్ సంస్థ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్టు టీడీఎఫ్ మహిళ అధ్యక్షురాలు టి వాణి తెలిపారు. ఈ బ్యాచ్ లో సుమారు 45 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అడ్మిషన్స్ పూర్తయ్యాయని, శిక్షణ కోసం చేరేందుకు ఆసక్తి ఉన్న మహిళలు వచ్చే బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని మహిళలు పూర్తిగా సద్వియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సిరెడ్డి తెలిపారు. మహిళలు నిబద్ధతతో, క్రమశిక్షణతో ఈ శిక్షణ తీసుకుని, స్వయం ఉపాధికి తోడ్పడాలని కోరారు. తాము ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ శిక్షణ శిబిరానికి వచ్చిన మహిళలకు టీడీఎఫ్ – యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ వారి సహకారంతో, టీడీఎఫ్ యూఎస్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షులు తోట గణేష్ సహకారంతో మహిళలకు ఉచిత టైలరింగ్ కిట్స్ అందించినట్టు టీడీఎఫ్ – యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సభ్యురాలు వాణి గడ్డం తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్, వెల్ఫేర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు మార్కండే భవాని, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి, టీడీఎఫ్ వనిత అధ్యక్షురాలు టి వాణి, టీడీఎఫ్ యూఎస్ఏ అట్లంట సభ్యురాలు వాణి గడ్డం, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ జ్యోతి కృష్ణ, తూప్రాన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, తూప్రాన్ మహిళలు, తూప్రాన్ పట్టణ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
