ప్రియమైన KTR గారికి…
కేవలం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు..
అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ నిరుద్యోగ యువత కి ఉపాధి -అవకాశాలు కల్పించండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి దారి తీసిన “ముల్కి రూల్స్” పోరాటం తెలంగాణ యువత, ఉద్యోగ ఉపాధి అవకాశాలకై జరిగిందని మనం మరువ వద్దు అన్న.

తొలి దశ తెలంగాణ పోరాటం
“ఇడ్లి -సాంబార్ గో బ్యాక్ ” పోరాటం.. మొదలు 1969లో జరిగిన సమైక్య దోపిడీ పాలకులు కర్కాషంగా కాల్పులు జరిపి వందలది తెలంగాణ ఉద్యమ కారులను పొట్టన పెట్టుకున్న ఆస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం లో అంతర్గతంగా ఉంది. నాటి యువత కి న్యాయపరంగా దక్కవాల్సిన ఉద్యోగ – ఉపాధి అవకాశాల గురించే అని మనం మరువవద్దు.

మలిదశ ఉద్యోమం లో నిరుద్యోగ యువత ఆత్మ బలిదానలు చేసుకుంది…
భవిష్యత్ లో తెలంగాణ యువత బాగుండాలనే… అని మరువ వద్దు.

ఆరు దశాబ్దాల ఆత్మ గౌరవ పోరాటం…
వందలాది ఉద్యమకారులు అమరులై, వేలాది ఉద్యమకారులు పోలీస్ లాఠీ దెబ్బలు తిని, జైలు శిక్షలు అనుభవించి, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొని, అనారోగ్యలకు గురి అయి సబ్బండ వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా ఏర్పడిన స్వరాష్టం లో కోటి ఆశలతో అడుగు పెట్టిన నిరుద్యోగ యువత కి ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు అందలేదని “నగ్న సత్యం “.

ఈ పరిస్థితుల వలనే రాష్ట్రముని కొంతమంది నిరుద్యోగ యువత కుంగుబాటు కి గురి అయి, క్షానికవేశంలో కొన్ని సార్లు ఆత్మ హత్యలు చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ నోటిఫికేషన్ లతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ భృతి -జీవన భృతి కానేరాదు .

తలసారి ఆదాయం పెరుగుకుండా, కొంతమంది పెట్టు బడి దారుల, కార్పొరేట్ శక్తుల వ్యక్తి గత ఆదాయం పెరగటం తెలంగాణ సమాజం లో పెద్ద చీలిక గా తీసుకు రావటం తద్యం.
అన్ని వర్గల అభివృద్ధి జరిగే భవిష్యత్ ప్రణాళిక తోనే బంగారు తెలంగాణ సాధ్యం.

చైనా సామెత: చేపలు పట్టి ఇవ్వటం కాదు, ప్రజలకు చేపలు పట్టడం నేర్పండి.. అన్నట్లు పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమ లలో స్థానిక యువత కి ఉపాధి

అవకాశాల కల్పనా
తెలంగాణ, దేశ ప్రజల అవసరాలకి ఉత్పత్తి , డిమాండ్ కిని అందించాగలిగే మానవ వనరులు మన రాష్ట్రము లో పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో మేధోవంతమైన, కష్టపడి పనిచేసుకుని తమ కాళ్ళపై తాము నిలబడి, తల్లి దండ్రులు సంతోషంగా ఉండేలా సమాజంలో గౌరవ జీవితం గడపాలని కోరుకునే యువత పెద్ద ఎత్తున ఉంది. ఈ నిరుద్యోగ యువత కి పరిశ్రమలలో ఉత్పత్తి, అవసరలకు అనుగుణంగా స్కిల్ డౌలాప్ మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని, చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి, బ్యాంక్ ల ద్వారా రుణాలు కల్పించటం ద్వారా మార్కెట్ అవకాశాలు కల్పించటం ద్వారా కొంత నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది.

నీళ్లు -నిధులు -నియామకాలకై ఆరు దశబ్దలు సాగిన ఆత్మ గౌరవ పోరాటం, వందలాది తెలంగాణ ఉద్యమకారుల ఆత్మబ‌లిదానాల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన రాష్ట్రం మనది. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా, నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారం అయ్యే ప్రణాళిక రూపొందించి, అమలు జరిపే బాధ్య‌త తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమయోధులు అయినా మీకు రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు అన్న…

తెలంగాణ ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలని ఆశిస్తూ…
ఆ దిశగా అడుగులు పడితే మీతో సామాజిక స్పృహ కలిగిన యువత కలిసి వస్తుందని తెలియజేస్తూ…

మీ…
అనంతుల మధు.
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇంచార్జి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *