ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్, డా. బాబూ జాగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
HYDERABAD (MEDIABOSS NETWORK):
దళితులలో అత్యంత వెనుకబడ్డ ఎస్సీ ఉపకులాల సమస్యలు పరిష్కరించి ఇకపై వారికే ప్రాధాన్యతనిస్తామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డా. బాబూ జాగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. మహనీయుల ఆశయాల ప్రకారం అత్యంత వెనుకబడిన వర్గాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేస్తామని, కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి మాట్లాడుతూ.. దళితబందు పథకంలో ఎస్సీ ఉపకులాలకు 40శాతం కేటాయించాలని, కళలపై, చేతివృత్తులపై ఆధారపడిన ఉపకులాల ప్రజలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాసాధనకు కృషి చేస్తున్న ఎస్సీ ఉపకులాల నాయకులను దళిత సేవారత్న అవార్డులను ప్రధానం చేసారు. దళిత ఉప కులాల కళాకారుల ప్రదర్శనల అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు, మేధావి జె.బి. రాజు, నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, పురం శివశంకర్ మాలజంగం,ఆదిమూళ్ల వెంకటేష్ హోలీయదాసరితులసి దాస్ గైక్వాడ్ మాంగ్, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, బుద్ధుల గంగ నర్సయ్య మాష్టిన్, కురువ విజయ్ కుమార్, ఓటరికారి గంగాధర్ మోచి, కర్నె రామారావు డక్కలి, దొంబర దివాకర్, మురళి మిత అయ్యాల్వర్, బక్కూరి పవన్ ద్యావతి, మటపతి నాగయ్య బేడ జంగం, మల్లెల సాయి చరణ్, ఆంధ్రప్రదేశ్ నుండి దూపం సత్యం బేడజంగం, గంటా రామకృష్ణ పైడి, యెషపోగు బాబూ డక్కలి, కృష్ణమూర్తి మాదిగదాసు తదితరులు పాల్గొన్నారు.
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews