హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత ద్రౌపది ముర్ముకు మహరాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అభినందనలు తెలిపారు. విద్యాసాగర్ రావు మహరాష్ట్ర గవర్నర్ గా కొనసాగిన సమయంలో ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. తాజాగా ఎన్డీయే రాష్టపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ద్రౌపది ముర్ముతో తనకున్న అనుబంధాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేసుకున్నారు. ద్రౌపది ముర్ము తనకు సోదరిలాంటిది అని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా ద్రౌపది ముర్ముకు ఫోన్ చేసి విద్యాసాగర్ రావు అభినందించారు.
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ద్రౌపతి తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని గుర్తు చేశారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారిత కోసం ద్రౌపది ఎంతో కృషి చేశారని విద్యాసాగర్‌రావు కొనియాడారు. విశేష పరిపాలనా అనుభవం ఉన్న ద్రౌపది ముర్ము.. మన దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.