హనుమకొండ: వీఆర్‌ఏ (VRA) సంఘం నేతలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్ కి వినతి పత్రం అందించగా.. వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే కేసీఆర్ విసిరివేశారు. డ్రామాలాడుతున్నారంటూ వీఆర్‌ఏ సంఘం నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన్ని వీఆర్‌ఏ సంఘం నాయకులు కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ పరిణామంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా వుండగా అంతకుముందు జనగామ వద్ద సీఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలింది. . ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే హనుమకొండలో మాత్రం వారిపై కేసీఆర్ ఈ విధంగా స్పందించడం విఆర్ఏలను విస్మయానికి గురిచేసింది.
VRA ఆత్మహత్యయత్నం
నర్సంపేట, నెక్కొండ : నెక్కొండ మండల కేంద్రంలో వీఆర్ ఏ మనస్థాపానికి గురైన ఆత్మహత్యయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ మహమ్మద్ ఖాసిం గత 69 రోజులుగా దీక్ష చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదంటూ మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శనివారం నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరం వద్ద బ్లేడుతో మెడ కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి వీఆర్ఏ లు ఆస్పత్రి కి తరలించారు.
- BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి