• DNR ట్రస్ట్ విద్యా సేవా కార్యక్రమాలు
  • ఎస్సెస్సీ టాప‌ర్స్‌కు న‌గ‌దు బ‌హుమ‌తి
  • పేద విద్యార్థుల‌కు ల్యాప్‌టాప్‌లు అంద‌జేత‌
  • గ‌న్నోజు ప్ర‌సాద్ ‘తొలిపొద్దు’ క‌వితా సంపుటి ఆవిష్క‌ర‌ణ‌

ములుగు: గ‌త13 ఏళ్లుగా ములుగు మండ‌లంలో ప్ర‌తిభ‌గ‌ల విద్యార్థుల‌కు తోడ్పాటును అందిస్తున్న డీఎన్ఆర్ ట్రస్ట్ తాజాగా ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం నిర్వహించింది. దేవగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జ‌రిగిన‌ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవంలో ములుగు మండలంలో 2022 -23 విద్యా సంవత్సరానికి గాను మొదటి స్థానం నిలిచిన SSC (పదవ తరగతి) విద్యార్థులకు రూ. 3000, ద్వితీయ బహుమతి రూ. 2000, తృతీయ బహుమతి రూ. 1000 న‌గ‌దు బహుకరించారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవగిరి పట్నం వారికి కూడా ప్రథ‌మ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణులైన వారికి 3000, 2000, 1000 రూపాయలు చొప్పున బహుమతులు అందించారు.

11 మంది పేద ప్రతిభ విద్యార్థులకు లాప్‌టాప్‌లు బహుక‌రించారు. కళాకారులను, వాలంటీరులను సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో DNR ట్రస్ట్ విద్యా సేవా కార్యక్రమాలను వివ‌రిస్తూ గ‌న్నోజు ప్ర‌సాద్ రాసిన తొలిపొద్దు క‌వితా సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డీఎన్ఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాపరెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఆర్షం రాజు, మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు ఎనుగాల సూర్యనారాయణ, సైకం శ్రీనివాస్ రెడ్డి, కందాల రామయ్య, CRP చిరంజీవి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin