మేడ్చల్: మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ గ్రామానికి చెందిన మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీటీసీ ఇర్రి రవీందర్ రెడ్డి మాతృమూర్తి జానమ్మ దశదినకర్మ కార్యక్రమంలో టీ-పీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. వజ్రేష్ యాదవ్‌తో పాటు కిషన్ సెల్ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త గోన మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు పోచయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవ రెడ్డి, మూడు చింతలపల్లి మండల్ అధ్యక్షులు నర్సింహా యాదవ్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, కీసర మండల్ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, ఎంపీటీసీ గోన హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్ చాప రాజు, జగన్ గూడా గ్రామ అధ్యక్షులు రవీందర్, కౌన్సిలర్ చాప రాజు ముదిరాజ్, రంజిత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.